పుట:Upanyaasapayoonidhi (1911).pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలిసికొనజాలనే చాలము. మనమెంతకాలము భగవంతుడు తెలిసికొనబడదగిన పదార్ధముగానెంచి మనతెలివితేటల వినియోగించి పైగా నాతనిదెలిసికొన ప్రయత్నింతుమో యంతకాలమును అతని మనము తెలిసికొనం జాలము. కావుననే.

                   "అవిజ్ఞాతం నిజానతామ్"
   అని ప్రాజదువులు వాకొనుచున్నవి.  మఱియు---
  "యదిమన్యసేనువేదేతి దహర మెబాసిమానం" అని ప్రామినుకులు తెలిపి నట్లుగా నేను తెలిసికొంటిని ననుకొనెడివాడు నిజముగా దెలిసికొనునది చాలా తక్కువగా నుండును. ఈ యభిప్రాయమును మనమత గ్రంధములుమాత్రమే తెలిపి యుండలేదు.  అన్ని మతగ్రంధములునుట్లె తెలుపుచున్నవి. క్రైస్తవుల బైబిలు నిట్లె నుడుపుచున్నది.  మహమ్మదీయల కొరానును ఇట్లె పలుకు చున్నది. బ్రహ్మసామాజికుల యాత్మనేదమును నిట్లె భాషింపుచున్నది.
  "భగవంతుడు మనస్సునకును వాక్కునకును అందరానివాడని తేటపడు చున్నది."
  అని బ్రాహ్మసామాజికులు తమగ్రంధములలో వ్రాసికొనియెయున్నారు.
  "No man hath seen God at any time"
  (మనుజుడు భగవంతునెప్పుడును గనుగొనియుండలేదు) అని బైబిలు చెప్పుచున్నది.