పుట:Upanyaasapayoonidhi (1911).pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

త్రిమతములు

 లోకములో ననేకమతభేదములు కలవు., ఆయామతములందు మరల ననే కాంతర భేదములుగలవు.  పరమతమ్నులనేకా వాంతర భేదములతో గూడుకొని యున్నవని యధిక్షేపించుచుండు క్రైస్తవుల మతమునందుగూడ నూటయేబది కంటెను నెక్కుడుభేదములు కలవు. వాని యీశాఖలన్నియు నేవేపూ యప్రధాన విషయములందు భెదబుద్దిని గలిగించుకొని పరస్పర వైషమ్యముతో నున్నవేకాని యెన్నదగిన  భేదముకలవికావు.  మన హిందూమతమునందును ననవసర ములగు బేరములనేకములుకలవు కాని త్రిమతములని పిలువంబడుచున్న ద్వైత, విశిష్టాద్వైత అద్త్విత అద్వైతమతములట్టివి కావు.  ఇవిన్యాయ్యమగు బేదమంనుగలిగి జ్ఞానముయొక్క క్రమాభివృద్ధిని తెలుప్ స్వాబావిక మతశాఖలై యున్నవి.
  జీవేశ్వరులకు భేదమును దెల్పునదిద్వైతము,  జీవేశ్వరులకు నభెదమును దెలుపునది యద్వైతము, జీవేశ్వరులకు నొకవిధముగాభేదమును నికనొక విధముగాభేదమును దెలుపునది విశిష్టాద్వైతము.  వీనిలో నేదిలేకపోయినను సత్యజ్ఞానమం కలుగనేరదు.  ద్వైతమంలేకున్న ప్రారంభదశయే లేదు అద్వైతమం లేకున్నదుదిదశయేలేదు.  ఈ రెండును నుండి నడిమిది యగు విశిష్టాద్వైతమేలేకుండిన మధ్యదశయేలేదు. మధ్యది