పుట:TyagarajaDivyanamaSankeerathanaluUtsvaSampradayaKeerthamnalu.djvu/9

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్వారం భవనారాయణరావు, ప్రధాన అధ్యాపకులు

జి.వి.ఆర్. ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, విజయవాడ

                             అ భి నం ద న లు
        త్యాగరాజ మహనీయుని భక్తి సంగీత రచనా సాగరం నుండి ఆవిర్భవించిన ఆణీముత్యాలే వారి దివ్యనామ సంకీర్తనలు.  ఉత్సవ సంప్రదాయ కీరెతనలూను.  సర్వసంగీతలోక సులభసాధ్యాలైన ఈ రచనలు భక్తి భావసంపూర్ణాలు, రామదారు సంకీర్తన భక్తకోటి మధుప మందారాలు.
       సంగీతపరంగా త్యల్ప పరిధిలో సంపూర్ణ రాగభావ రసాది ప్రపూరితాలు; రాగరసవాహీనీ సులభ సుకర ప్రవాహినులు.  సంగీతంలో ఏ కొద్దిపాటి శిక్షణ పొందిన విద్యార్ధులతొ పాటు, ఏ శిక్షణా లేకపోయినప్పటికీ అవలేశమాత్రపు సంగీతాంశ ఉంటే చాలి భక్తి పరవశులు విని, గాయక బృందంలో చేరి పాడవనకాశ మిచ్చే అద్భుత, మనోహర రచనలు.
    నిజానికి, కర్ణాటక సంగీత సౌందర్య రహస్యమంతా ఈ చిన్ని కీర్తన రచనలలో సూత్రప్రాయంగా దాక్కుని ఉందంటే అది అదిశయోక్తికారు.  కాగా, విశిష్ట కర్ణాటక్ సంగీతపు శుచి, సంప్రదాయాల కివి ప్రతీలలు.
     దక్షిణదేశంలో, ముఖ్యంగా తమిళనాడులో ప్రతియింట ఈ కీర్తనలు సంప్రదాయ శుద్ధంగా గానం చేసేవారు ఇంటికొకరైనా ఉంటారనిపిస్తుంది.  ఆటువంటి వారింట భ్ణక్తి ప్రపత్తులతో జరిగే గాన గోష్ఠులలో ఈ కీర్తనాగానం ప్రముఖస్థానం వహిస్తూ ఉంటుంది. అలాంటి బృందగానంవల్ల సంగీత సంప్రదాయం తెలియకుండానే తరం నుండి తరానికి వ్యాప్తి చెంది, ఈనాటికి చెక్కు చెదరక స్థిరంగా నిలిచి ఉంది.  అదే వారసత్వంగా మనకు లభించిన కర్ణాటక సంగీత సంపద.  అదే మనం సగర్వంగా చెప్పుకోదగ్గ సంగీత సంస్కృతీ నిక్షేపం.  అదే మనం అత్యంత జాగరూకతతో, దూరదృష్ఠితో కలకాలం భద్రంగా కాపాడుకోవలసిన ఆస్తి.