పుట:TyagarajaDivyanamaSankeerathanaluUtsvaSampradayaKeerthamnalu.djvu/4

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాట్యకళ తెలుగువారి చలనచిత్రకళ, ఆంగ్లములో ప్రచురించిన సురభి దీయేటర్సు, కూచిపూడి క్లాసికల్ డాన్సు, హిందీలో ప్రచురించిన మత్ త్యాగరజ్, ఈ తరగతికి చెందిన గ్రంధాలు.

    సుప్రసిద్ధ వాగ్గేయకారుల రచనలను వరుసగా ప్ర్రచురించాలన్నపధకం క్రింద క్షేత్రయ్య అదములు, రామదాసు కీర్తనలు, స్వరాలతోను, త్యాగరాజు కీర్తనలకు ఆంన్ని వ్యాఖ్యాలతో త్యాగోపనిషత్ ను ఇదివరలో ప్రచురించడం జరిగింది.  ఇప్పుడు త్యాగరాజకృతదివ్యనామసంకీర్తనలను ఉత్సవ సంప్రదయ కీర్తనలను, స్వరహితంగా ఈ గ్రంధం, వెలువరిస్తున్నాము.  ఇంకను వివిధ రచయితల జావళీలు లలితగీతాల్ అనేపేరుతో ప్రఖ్యాత కవుల గేయాలు స్వరసహితంగా ప్రచురించటానికి నిర్ణయించాము.
   ఇంతేగాక ప్రస్తుతం ప్రతులు లభించని గ్రంధాలను పుఇనర్ముద్రించడానికి కూడ అకాడమీ సంకల్పించింది.  ఈ సంకల్పానికి రూపమే సంగీత సంప్రదాయ ప్రదర్శిని ప్రచురణ ఇంతవరకు నాలుగు సంపుటాలు ప్రచురించాము.  ఇంక ప్రధమాభ్యాస పుస్తకము మాత్రము వెలువడవలసియున్నది.
         ఈ గ్రంధాన్ని రూపొందించి ప్రచురణ అవకాశం అకాడమీకికల్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంగెత సభల సమాఖ్య వారి సహకారానికి మేముకృతజ్ఞలము. ఇందలి కీర్తనల స్వరాలను సమకూర్చిన శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లుగారికి, వ్రాతప్రతిని పరిశీలించిన శ్రీ నోరి నాగభూషణం గారికి, ప్రశంసా వాక్యాలు వ్రాసిన శ్రీ అరిపిరాల సత్యనారాయణమూర్తి గారికి, శ్రీద్వారంభావనారాయణరావుగారికి, మాధన్యవాదాలు.  ఈ గ్రంధముద్రణలో మకు తోడ్పడిన శ్రీ పాలగుమ్మి విశ్వనాధంగారికి మేము కృతజ్ఞలము.

కూర్మా వేణుగోపాలస్వామి, అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక ఆకాడమీ