పుట:TyagarajaDivyanamaSankeerathanaluUtsvaSampradayaKeerthamnalu.djvu/3

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తొ లి ప లు కు

    నృత్యసంగీత నాటకోత్సవాలు నిర్వహిచటం, ఆయాకళలలో శిక్షణాలయాలకు సాంస్కృతిక సంస్ధలకు, నిస్సహాయ స్థితిలోగల వృద్ధ కళాకారులకు ఆర్ధిక సహాయం చేయటం, మరుగున పడిపోతున్న మన సంప్రదాయ, జానపద కళాకారూపాల పుంర్వికాసానికి కృషిచేయటం మున్నగు కార్యక్రమాలతోపాటు గ్రంధాలు ప్రచురించే కర్యక్రమాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకడమీ చేపట్టింది.  ఈ పధకం క్రింద సంస్కృతం నుంచి ప్రామాణిక సంగీత, నృత్యశాస్త్ర గ్రందాలను తెలుగులోనికి అంవదింప జేసి ప్రచురిస్తున్నాము. ఇంతవరకు సంగీత రత్నాకరం మొదటి భాగము, నృత్యరత్నావళి, భావరకాశనము, అలా ప్రచురించాము.
     ఈ అనువాదాలతో పాటు తెలుగు నాట సంగీత నృత్యనాటక కళావికాశాలను త్రెలియ జేసే స్ఫతంత్రరచనలను కూడా ప్రచురించాలని అకాడెమీ సంకల్పించింది.  తెలుగులో భాకాకలాపం నందీశ్వర భరతం, ఆంగ్లంలో ఆంధ్రప్రదేశ్ లలితకళ అకాడమీ సహకారంతో "ఆంధ్రడాన్సు స్కల్ప్చర్" ఇట్టి స్వతంత్ర గ్రంధాలు ఇవిగాక కొన్నిలఘుగ్రందాలుకూడా ప్రచురించాం.  నాటక కళాభివృద్ధికి దోహదకారులైన తెలుగు నాటక కర్తలు చిలకమర్తి, తిరుపది వేంకటకవులు, ధర్మవరం, కోలాచలం గురించిన గ్రంధాలు.  హరికధ కళలో ఆదిభట్ల నారాయణదాసు, హిందూస్థానీ సంగీతంలో తబలా బోధిని, ప్రపంచ తెలుగు మహాసభల సందర్భమున తెలుగులో ప్రచురించిన యక్షగానం, బుఱ్ఱకధల్, జానపద సాహిత్యము, వీరగాధలు. తొలి సంకీర్తనకవులు, వాగ్గేయకారుల పదకృతి సాహిత్యం, ఆంధ్రుల సంగీత కళ, ఆంధ్రుల