పుట:TyagarajaDivyanamaSankeerathanaluUtsvaSampradayaKeerthamnalu.djvu/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గమనిక

ఇందు ప్రచురింపబడిన త్యాగరాజ దివ్యనామ సంకీర్తనలు, ఉత్సవ సంప్రదాయకీర్తనలూను, శ్రీవారి కృతులలోవలెగాక ఈ కీర్తనలలో పల్లవి, కొన్నిటిలో మాత్రము అనుపల్లవి, అన్నిటిలోను అనేకచరణములు గలవు. అన్ని కీర్తనలలో పల్లవికి విడిగాను, కొన్ని కీర్తనలలో పల్లవి, అనుపల్లవులకు విడివిడిగాను, మరికొన్ని కీర్తనలలో పల్లవి చరణములకు విడివిడిగాను స్వర మెట్టులు గలవు. చరణములు కొన్ని కీర్తనలలో పల్లవి వలెను, కొన్ని కీర్తనలలో అనుపల్లవి వలెను, మరికొన్ని కీర్తనలలో మొదటి చరణమువలెను ఆయా కీర్తనలలో వివరింపబడినట్లు పాడుకొనవలెను. ఇది పాఠకులు గమనింతురుగాక.

ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమి