పుట:Tirupati Venkata Kavula Natakamulu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఓం

శ్రీమత్పరదేవతాయైనమ:

పాండవ జననము

ద్వితీయాంశము

(అంత విరహావస్థతో శయనస్థుడై శంతనుడు ప్రవేశించును)

శంత- (నిట్టూర్పు పుచ్చి)

ఉ. వేటకు నెందు నేగితి? వివేకము నేటికి గోలుపోయి యా

   బోటిని గోరితిన్ సరియపో! యది సమ్మతి జూపనేల? య
   య్యాటవికుండు దాని పిత యందుల కడ్డు వచింప నేల? యా
   హాటక గాత్రి కూటమి కటా! యెటు లబ్బెడి నేది దిక్కికన్

కొలదిదినమ్ముల క్రిందటనే కదా నా ప్రియురాలు జాహ్నవి కొమరుని నాకు వప్పగించి వీడు సర్వవిద్యలయందును విద్వాంసుడయ్యెనిక వీనికి యౌవరాజ్యపదము నొసంగుమని చెప్పి యంతర్హితయయ్యె. దాశరాజు తన దౌహిత్రునకు రాజ్యమీయవలయుననియు లేనిచో గొమిరె నీయ ననియు నిష్కర్షగా చెప్పినాడు. అందులచే యొప్పుకొంటినేని,

మ. కొమరుం డుండగ బెండ్లిఆడు నవివేకుం డంచునే కాక పు

    త్రు మహీరాజ్యభరంబు పూనుపడహో! దుష్టుండు వీడంచు లో
    కము నిందించు నశించు ధర్మము యశికాముల్ మహీపాలు ర
    క్రము డీతండని గేలిసేసి కడు ధిక్కారింతు రెక్కాలమున్

ఎట్లయినను అత్తలోదరిని గొనికాని జీవింపజాలను. (మెచ్చుతో)

ఉ. ఆ యలరారు చూపులయొయారము నాగమనంపు సౌరు నా

   ప్రాయము తీరు నామురువు పల్కుల సొంపును నాయురోజస
   శ్రీయ నటుంత మేరకిని జెప్ను గిప్పదరంబుగాని వ
   క్కాయజరాజ్యలక్ష్మీ నవకాయ పరీమళ భాగ్యసంపదల్