పుట:Tirupati Venkata Kavula Natakamulu.pdf/21

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రథమాంకము

7

కృతకృత్యుఁడ నయ్యెద. ఇట్టి రహస్యసమయమున నన్నెవ రేమి సేయుదురు? (యోజించి) ఎట్టి గోప్యకృతులనైనఁ బంచభూతములును సూర్యచంద్రులును బరమాత్మయు జూచుచుందురుగదా! ఇదిగాక నేఁ జింతించినపని యోగ్యులకుచితమా! ఔచిత్యము మాటట్టులుండ బలాత్కరించుట యెంత నీచకృత్యము? (ఆలోచించి) అయినచోఁ గర్తవ్యమేమి? (నిశ్చయముగా) మాటలాడించి యిక్కన్నియ యనుగ్రహముం బడయుటకన్న వేఱొం డుపాయములేదు. (ప్రకాశము) లతాంగీ! నీపేరేమి?

మత్స్య - మత్స్యగంధి

పరా- (ఆఘ్రాణించుట నటించి) ఓహో! యీ మత్స్యగంధ మీపెశరీరము నుండియే వచ్చుచున్నదేమి! పాపము! ఈ వాసన యీ చక్కఁదనమున కెంతలోపముగానున్నది! (వెనుకచూచి) అప్పుడే యేటి నట్ట నడిమికి