పుట:Tirupati Venkata Kavula Natakamulu.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రథమాంకము

5

పౌద్ధత్త్యమ్ము వహించెదో కనెసదఁ గా కాహారవవ్యాస్త ది
ౙ్నద్ధంబై జగ మక్కజంపడఁగఁ జక్కంజేతు ని నన్నిక్కడన్.
    క. జనకుఁడు స్వేచ్ఛామరణ
        మ్మునొసంగె న్నాకటంచుఁ బొంగెదవో? య
        య్యనిమిషు లడ్డంబైనను
        నినుఁ జంపు సుదర్శనంబు నేఁడేమైనన్.
భీష్ము - (ధైర్యసంతోషములతో) దేవా! లీలామానుషవిగ్రహ!
   సీ. నేఁడుగా నాధనుర్నిగమంబులోకైక
                               విఖ్యాతమయ్యె సంవత్స్వరూప!
         నేఁడుగా నాజన్మ మీడులేని యశం బ
                                జాండంబు నిండించె దండితారి!
         నేఁడుగా నాబాహునాడులఁ బ్రవహించు
                               రక్తంబు శక్తంబు ముక్తగేయ!
         నేఁడుగా శంతను నృపతివరేణ్యుండు
                               పుత్రవంతుం డబ్ధిభూకశత్ర!
                  నేఁడుగా నిర్జరాపగ నిక్కమైన
                  వీరమాత ప్రఫుల్లదంభోరుహాక్ష!
                  రమ్ము దయసేయు మిటువేగిరమ్ము సంగ
                  రమ్ము తీర్పుము భూమిధరమ్ముతోడ.
మ. దయసేయంగదవయ్య కృష్ణ! త్రిజత్కళ్యాణ మోక్షం బొగిన్
     దయసేయంగదవయ్య; చక్రమున మత్కంఠంబు వైకుంఠ! వే
     గయిసేయంగదవయ్య; ధర్మసుతం నేకచ్ఛత్రసంపత్తిచేఁ
     గయిసేయంగదవయ్య; నీ కిదె నమస్కారంబు నారాయణా!
అర్జు- (ఎట్టకేలకుఁ గృష్ణునిలువరించి) బావా! వసుదేవనందన!
శా. గీతల్ సెప్పి రణంబుసేఁతకు ననుం గీల్కొల్పు టెల్లన్ ధరా
     నేతల్ నవ్వఁగఁ బాలుసేయుటకె యాసే! కొంత సైరించి నా
     ఖ్యాతిన్నిల్పుము సాత్యకిం దునిమిన ట్లాలంబు చాలింపవే
     నేతన్మాత్రకు యుద్ధరంగమున కే నేతేరఁగా నేటికిన్?
ఉ. చక్రము దాల్చి నీవు రిపుచక్రము ద్రుంచు టదేమిలెక్క? నీ
    వక్రమమే యొనర్చునెడ నాఁగునె యీపదునాల్గులోకముల్?
    శక్రసుతుండు వీరుఁడనుసద్యశముం గలిగింతువేని నీ
    విక్రమమున్ మరల్పు మరనిందదశేక్షణ! భక్తరక్షణా.