పుట:Tirupati Venkata Kavula Natakamulu.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

పాండవవిజయము

సూత్ర- (వినుటనటించి) చెలీ! నీ ఋతువర్ణనమునందలి ధార్తరాష్ట్ర పదంబునకు హంసవిశేషము లను నర్థముకన్న ఝడితిస్ఫూర్తి నందుచున్న కతన ధృతరాష్ట్ర పుత్రులను నర్థంబు గౌకొనుచుటేఁ గాబోలు భీష్ముఁడు మనపైఁగనలుచు నిటు వచ్చుచున్నాఁడు. ఇఁక మన మీతని యగ్రమున నిల్చుట తగదు. పోదమురమ్ము. (నిష్క్రమించుతురు)

(ఇది ప్రస్తావన)

(భీష్ముఁడు ధను:పాణియై పటాక్షేపముఁ బ్రవేశించి దృష్టినించి తనలో)

ఓహో ఇదియా హేతువు

చ. అనలము గ్రుమ్మరించెడి మదస్త్రపరంపరచేతఁ జాల నొ
    చ్చినకతనన్ యదూద్వహుఁడు చేత సుదర్శనమున్ ధరించి తా
    పము పొనరించు నాసమయముం దిగఁద్రావి ననున్ వధింపఁగా
    ననికిఁగడంగె (కొంచమూరకుండి) అర్జునుని యాననమల్లదె వెల్ల నయ్యెడిన్.
        (ఆశ్చర్యముతో)
మ. తన కేలం గల పగ్గముల్ కశయు భద్రంబౌగతిన్ డాఁచి హు
     మ్మని చక్రంబును గేలఁగైకొని యధర్మారంభుఁడయ్యున్ సధ
     ర్మునిఁ బార్ధుం గెలిపింపనెంచి యచలంబుంబోని కౌంతేయు స్యం
     దనమందుండి మృగేంద్రుభంగి ధరకున్ దైత్యారి లంఘించెడిన్.
        (మరలఁ బరికించి)
    వెనుకకు లాగు బాహువులు బిగ్గఁగఁబట్టి ధనంజయుండు; కో
    పనుఁడు సుదర్శనాయుధుఁడు పార్థునితోడన వచ్చుచుండె ముం
    దునకు; మహాశుగోద్ధతిని దూఁగుచు సంద్రము సాంద్రభంగి ని
    స్స్వనితముగాఁగ నేగుతఱి సంయుతమౌతరి యేపు దోఁపగన్
               (యథోక్తముగాఁ గృష్ణార్జునులు ప్రవేశింతురు)

అర్జు- శా. బావా! కోపము సంహరింపుము రణప్రారంభమున్ మాను మీ
            వే వీఁకన్ రణమునం బొనర్చు నెడలన్ వీఁడేల? నీ ఢాకకున్
            దేవన్ వీడని వీరుఁడెవ్వఁడు? కృపాసింధుడవై నాయక
            శ్శ్రీవర్థిల్లఁగఁ జేయుమయ్య యనఘా! చేమోడ్పు సంధించెదన్.

కృష్ణు- (అనాకర్షితముగా ముందడుగు వేయుచు)
    శా. వృద్ధుండౌ నలజామదగ్న్యుఁ డేమనుకొంటే? వీఁడు పార్ధుండు నీ
         యుద్ధప్రక్రియ కోహటించె నని లో సుబ్బంగ నింకెంత సే