పుట:Tirupati Venkata Kavula Natakamulu.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

పాండవ విజయము

కర్ణసంరోధియై కల్మిఁగాంచుఁగాని
కాలగతిఁగ్రుంగుఁ బాండవాక్రాంతమగును

నటి- కాలక్రమముమాటఁ దలంచిన నీకురుల సంతతియే కాదు

గీ. అంచితాంగాతిశయమెల్ల నడఁగిపోవుఁ
    జివరకు బలంబు శల్యావశిష్టమగును
    గడకు భీమగదాహతిఁ గాళ్ళు గదప
    లేక చెడు రాజరాజైన వీఁక యెడలి.

సూత్ర- ఈయప్రస్తుత ప్రశంసవలనఁ బ్రకృతమే మఱచితిని.

నటి- 'ఏమి సెల'వని మొదటనే ప్రార్ధించితిని గదా.

సూత్ర- ఇదిగో నీ పత్రికఁ జదివికొనుము. (చేతికిచ్చును)

నటి- (తనలోఁజదివికొని ప్రకాశముగా)

గీ. పాండు సంతాన కీర్తి దర్పణము ధార్త
    రాష్ట్రశతతతదుర్యశోర్పణము నవర
    సాపణముఁ జూడవలయు సంసారభార
    తరణమగునట్టి యాభారతరణమిపుడు.

అని యందున్నద.ఇ కావునఁ తత్కథాభూయిష్టమగు నాటకమును బ్రదర్శింపవలయు. కాని యట్టి నాటక మేదియో స్మృతికి రాకున్నది.

సూత్ర- స్మృతికి రాదేమి? నేనిదివరకే నిశ్చయించుకొని యున్నాను.

నటి- దానిపేరేమి సెలవిండు.

సూత్ర-

    సీ. గోదావరీ పావనోదార తీరద్వ
                    యీరాజితావనీదారుఁడనుచు
        సంస్కృతాంధ్రకవిత్వ సారస్వమకరంద
                    భసలాయితామిత ప్రతిభుఁడనుచు
        హూణభాషోదన్వ దుల్లంఘనక్రమ
                    ప్రాప్త బీ. ఏ. పట్టభద్రుఁడనుచుఁ
        గరుణాంతరంగరంగత్కటాక్షచ్ఛటా
                    పాలితాఖిల పరివారుఁడనుచుఁ
            నెవని నుతియింతు రట్టిపోలవరనగర
            పాలకుండును బ్రాహ్మణ ప్రభువునైన
            కృష్ణభూపాలకవరుని ప్రేరేపణమున
            సకలగీర్వాణ రూపరూపకము లరసి.