పుట:Tirupati Venkata Kavula Natakamulu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6 పాండవజననము.

సీ. మృగశాబములకు నేర్పెడినేర్పు గలచూపు
                         సోయగం బొలుకు కందోయితళుకు
కుంభికుంభములయుక్కును ద్రొక్కి నిక్కినీ
                         ల్గెడి గుబ్బచన్గవలేబెడంగు
మాటిమాటికి ముద్దు మూటగట్టఁగఁ జాలు
                         మురుపున మెఱయు నెమ్మోహముహరుపు
మిసమిసల్ నించు క్రొమ్మించుసంచు నడంచు
                         మెఱుఁగారు నెమ్మేని మెలపుసొలపు
తే. గీ. గనినదో నెట్టి జడదారి కన్నుఁగవయు
        రిచ్చవడు నట్టి యీమోవిమెచ్చులాఁడి
        యచ్చరకుఁ బుట్టు పందక యక్కటకట!
        నుచ్చెములఁ బట్టు నెడ్డె కేమాడ్కిఁ బుట్టె?
     (ధ్యానించుట నటించును.)

మత్స్య- (తనలో) ఋయనఘుఁ డేమో యోజించుచు నామాట వినింపించుకొన్నట్లే లేదు. "తొరలో నమ్మునివరు నవలి కనిపిర"మ్మని తండ్రి నాకానతిచ్చెఁగదా! తడవు చేసితినేని జనకునాజ్ఞ ననాదరించిన దాన నగుదును. కావున నిమ్మహనీయు నిఁక నొకపరి వేగిరించెద. (ప్రకాశము) స్వామీ! తడయక దయసేయుఁడు. మిమ్మవల దింపు నేను వెనువెంటనే యిటకు రావలయు.

పరా- (తనలో) ఔరా! యీమాటల పొందిక! ఇట్టి పలుకులతో నీకన్నియ యెవరి నేమి కోరినను వృథా పోదు. (ప్రకాశము) ఇదుగో వచ్చుచున్నాఁడను. (పుట్టె నెక్కి మరల ధ్యానించుచుండును.)

మత్స్య - (పుట్టెను తెడ్డుతో నడుపును)

పరా - (తనలో) ఇప్పటికిఁ దేలినది. ఈ సుందరి వసువీర్యసంభవ. ఈపె తల్లి నిక్కముగా నచ్చరయే కాని శాపవశమున మత్స్యమై యీబాలను గడుపున ధరించియున్న కాలమున నీదాశరాజు భృత్యులకుఁ జిక్కినది. వా రా చేఁప యందమున కచ్చెరువంది తమ రాజునకుఁ గానుక వెట్టిరి. పదఁపడి యద్దాని గర్భమ్మున నిక్కన్నియయు నిఁక నొక బాలకుండును. జన్మించిరి. ఈపె సర్వథా మాన్యురాలుగాని కేవల నీచురాలుగాదు. (యోజించి) ఏమో నామన మిత్తరలాక్షిం దగిలి మరలకున్నయది. ఇందుపాయమేమి? (పరికించి) ఈపె నా(?) కేనియుం జూడక పుట్టె నడిపించుచున్నది. కొంచెము పలుకరించి చూతునా? (సంశయించి) మాటలాడ దేమో? (ధైర్యముతో) ఆడనిచో బలాత్కరించియేని