పుట:Tikkana-Somayaji.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

తిక్కన సోమయాజి


నియనుఁగుఁ దమ్ముఁడును, సంస్కృతాదిభాషా కావ్యకర్తృత్వమున నుతిఁగన్నవాఁడును, అభినవదండినావినుతి గన్నవాఁడును, విఖ్యాతయశుఁడు నైన కేతనార్యుని రప్పించి యాసనార్ఘ్యపాద్యతాంబూలాంబరా భరణదానాద్యుపచారంబులఁ బరితుష్టహృదయుం జేసి, 'ఆర్యా! నీవుసంస్కృతాద్యనేక భాషాకావ్యరచనావిశారదుండ వగుట జగత్ప్రసిద్దంబు గావున నొక్క కావ్యంబు రచియించి నన్నుఁ గృతిపతిం జేయవలయు' నని సగౌరవంబుగాఁ బ్రార్థించినందునఁ గేతన తనకావ్యకన్యకుఁ దిక్కన తగినవరుం డనిభావించి సంస్కృతమున దండి రచియించిన దశకుమారచరిత్రము సంచితభావరసో దయాభిరామమ్ముగా రచియించి యంకితము చేసే నని దశకుమారచరిత్ర పీఠికవలన వేద్యమగుచున్నది. ఈదశకుమారచరిత్రము నీతఁడు తిక్కన మెచ్చుకొను నంతరసమంతముగానే రచియించెను. ఇయ్యది తిక్కనభారతమునకుఁ బూర్వముననే రచియింపఁ బడిన దనుటకు సందియము లేదు. మనుమసిద్ది పదభ్రష్టుఁడై కాకతీయునిఁ బ్రాపువలనఁ బునరభిషిక్తుఁ డగుటకుఁ బూర్వమే యీకావ్యము రచియింపఁ బడినదనుట కావిషయ మెద్దియునిందుఁ దెలుపఁబడకుండుటయే ముఖ్యకారణము. తిక్కననుగూర్చి సమకాలికుఁ డైనకేతనపలికిన పలుకులు విశ్వసనీయములని శ్రీయుతులు జె. కృష్ణరావు గారు వ్రాసిన వాక్యములనే నే నీదిగువ నుదాహరించుచున్నాను.

"బోద్ధారో మత్సరగ్రస్తాః" అనువచనంబురీతి సాధారణంబుగఁ బండితప్రకాండులు పరస్పర కావ్యరత్నంబుల నసూయాక్షిరోగ నిష్పీడిత