86
తిక్కన సోమయాజి
ప్రక్కను దిపిటీముందరదీపములై ప్రకాశింపక కాలక్రమమున నశించిపోయి నామమాత్రావశిష్టములై యున్నవి. తిక్కన సోమయాజి యిట్టివాఁ డగుటచేతనే కేతనకవి దశకుమారచరిత్రమునం దిట్లభివర్ణించి యున్నాఁడు.
"సీ. సరసకవీంద్రుల సత్ప్రబంథములొప్పఁ
గొను నను టధికకీర్తనకుఁ దెరువు
లలిత నానాకావ్యములు చెప్పు నుభయభా
షలయందు ననుట ప్రశంసత్రోవ
యర్థిమైఁ బెక్కూళ్ల నగ్రహారంబులఁ
గా నిచ్చు ననుట పొగడ్తపొలము
మహితదక్షిణ లైనబహువిధయాగంబు
లొనరించు ననుట వర్ణనము దారి
పరుని కొక్కని కిన్నియుఁ బ్రకటవృత్తి
నిజములై పెంపు సొంపారి నెగడునట్టి
కొమ్మనామాత్యుతిక్కని కొలదిసచివు
లింక నొక్కరుఁ డెన్నంగ నెందుఁ గలఁడు."
తిక్కన సోమయాజి శ్రీమంతుఁడు ; నిరర్గళధీమంతుఁడు; అధ్వరాబ్జదిననాధుఁడు; నీతిచాణక్యుఁడు; కృతిపతి; కృతికర్త; శౌర్యత్యాగ విఖ్యాతశాలి; మన్మక్ష్మాపాల మంత్రిమాడుణిక్యుడు; దండాధీశుఁడు; బ్రహ్మవేత్త, ఇన్నిలక్షణము లొక్కనియందే పట్టియుండుటవలనఁ గేతనయొక్కఁడే గాఁడు కేతనను బుట్టించినదైవము సయితము మెచ్చుకొనకమానఁడు. ఆకాలము నందుఁ గవిత చెప్పి తిక్కనసోమయాజుని మెప్పించుట కష్ట