ఎనిమిదవ యధ్యాయము
85
విద్యాపరిశ్రమవేదియుఁ గవిసార్వభౌముని పుత్త్రుఁడును గావున మనుమసిద్ధి తిక్కన యధిష్ఠించిన విద్యాగురుపీఠముయొక్క మాహాత్మ్యము ననుభవపూర్వకముగా నెఱింగినవాఁడే గావున వినయవిధేయతలను జూపుచుఁ బూజింపుచుండెను. ఇట్లు పాండిత్యకవిత్వ సామ్రాజ్య పట్టాభిషిక్తుఁడై వైదికమార్గనిష్ఠమగు వర్తనము గలవాఁడై క్రతుదీక్షఁ బూని భూసురబృందమున కానందము సంఘటించి విహువిధాధ్వరములనుగావించి త్యాగశీలుఁడై బహువిధదానములను జేసి ఋత్విక్కులను దృప్తులను గావింపుచుఁ దనయశము నాంధ్రప్రపంచమున దశదిశలకుఁ బఱపుచుండెను. వైదికమతోద్దరణమునకై చతుర్ముఖుఁడు తిక్కనరూపమున నవతరించినవాఁడని యాంధ్రలోకము విశ్వసించి బ్రహ్మపీఠము నొసంగెను. నిర్వచనోత్తరరామాయణము రచించి మనుమసిద్ధి కంకితముచేసిన పదిసంవత్సరములలో దిక్కనసోమయాజి యాంధ్రదేశమున నిట్టిమహెన్నతపదవిని బొందెను. ఏవేళను నీతని పవిత్రగృహమున వేదఘోషము వినంబడుచునే యుండును. ఆకాలమున నాంధ్రదేశములోని వేదవేత్తలు మంత్రవేత్తలు నీమహానుభావుని సందర్శింపఁకుండ నుండ లేదు. అట్లే కవిపండితకోటియు విక్రమ సింహపురమునకు నేగుదెంచి యీకవి బ్రహ్మను సందర్శింపకుండ నుండ లేదు. ఈకాలముననే యీతఁడు విజయసేనము మొదలగుకావ్యములను రచించెనుగాని యవి యన్నియు భారతము