ఈ పుట అచ్చుదిద్దబడ్డది
భూమిక
ఆంధ్రభాషాభివర్ధనీ సంఘమువారిపక్షమున మేము బ్రకటించుటకిది మూడవగ్రంధము. వెనుకటి గ్రందములను . ప్రకటించుకొనినప్పుడు వెల లధికముగ నున్నవని విన్నవించుకొనియున్నాము. ఇప్పుడు అంతకంటెను వెలలధికమగుటయేగాక వలయు కాగితమునకుగూడ క్షామముపట్టినది. ఎట్టి కష్టములకులోనైనను గ్రంథప్రకటనమును మాననిష్టములేక .ప్రకటించుచున్నాము.
ఇప్పుడచ్చులో ఇదివరకుఆంధ్రమున ప్రకటింపబడని ఉద్గ్రంథములు రెండున్నవి. వానీలోఒకటి, ఇండియాదేశ ఐశ్వర్యమునుగూర్చిన గ్రంధము. రెండవది రెండువేలసంవత్సరముల హిందూదేశ నౌకాచరిత్రము. ఈ రెండింటిలో నొకగ్రంథమును డిశంబరునెలలో చందాదార్లకు పంపుకొనెదము. ఇట్టిసంఘములుచేయు భాషాభివృద్ది అభిమానుల యాదారముపైన నాధారపడియుండును. గనుక మంచిచెడ్డల నారసి చదువరులు మా యుద్యమమునకు తోడ్పడ ప్రార్థించుచున్నాము
శారదా పబ్లిషింగు కంపెనీ.