80
తిక్కన సోమయాజి
గృతినొసంగవలయు ననియెగాని మక్కికి మక్కిగా సంస్కృతమునకు సరియైనతెలుఁగు చేయవలయుననిగాదు. అందుకొఱకే తిక్కనకథను సంస్కృతములోనుండి గొన్నిమార్పులతోఁ దీసికొని యనుచితములుగాఁ దోచినవానిని ద్రోసిపుచ్చి యుచితములనితోఁచిన వానిలోఁ గొన్నిటిని పెంచి కూడ వ్రాసెను. నిర్వచనోత్తర రామాయణములోని కొన్ని ప్రౌఢభాగము లన్వయ కాఠిన్యములుగఁ గన్పట్టవచ్చును. అక్కడక్కడ కొన్నిపద్యములు చూచిన శైలి నారికేళపాకముగాఁ గన్పట్టవచ్చును. కాని గ్రంథమును సాంతముగాఁ జదివినవారికి శైలి ద్రాక్షాపాకమును గదళీపాకము నై ప్రౌడముగానే కన్పట్టుచుండును. ఈకావ్యమునందు రామనిర్యాణకథను జెప్పుటకు భీతిల్లి తుదియాశ్వాసమును విడిచిపెట్టె ననికొందఱుపెద్దలు చెప్పుదు రని యట్లు భావించుట తగునా? అట్లయ్యెనేని తిక్కనసోమయాజి భారతములో స్వర్గారోహణపర్వములోఁ గృష్ణనిర్యాణమును, అటుపిమ్మటఁ బాండవులలోకాంతర గమనమును జెప్పుటకు నేల భీతిల్లి విడిచి పెట్టలేదు? తుదియాశ్వాసము విడిచిపెట్టుటకు మఱియొకకారణ మేదియైన యుండవలెనుగాని యిది కారణముగాదు. ఆతుదియాశ్వాసమును దెనిగించిన జయంతిరామభట్టయినను తాను దానిని తెలిగించుటకుఁగారణమును జెప్పినవాఁడు గాఁడు. కొన్నివిషయములలోఁ బాపరాజకవికృత మైనయుత్తర రామాయణమున కన్న రసపుష్టి కలదిగా నున్నది. ఇదిభారతము