ఏడవ యధ్యాయము
79
మఱియొండు గాదు. ఇది బాల్యము వీడి యౌవనము ప్రవేశించిన తరువాత వ్రాసిన ప్రౌఢకావ్యమెగాని యప్రౌఢకావ్యముగాదని పీఠికలోని విషయములే వేనోళ్ళఁ జాటుచున్నవి. వివిధవిద్యాపరి శ్రమవేదియైన ప్రభువు (కృతిపతి) అప్రౌడుఁడైన యొకబాలకవిని 'మామా' యని పిలుచుటయుఁ బిలుచు చుండెఁ బో 'మామా' యనుచున్నందుకుఁ గృతి నిమ్మని యడుగుటయు సంభవము గాదు. వేయు నేల? నిర్వచనోత్తర రామాయణములోని యవతారికయే మిక్కిలి ప్రౌఢముగా నున్నది. అవతారికలోనే యింతప్రౌఢిమను జూపఁగలిగినవాడు బాలకవి యెట్లగును? ఇతఁడు,
"క. వచనము లేకయ వర్ణన
రచియింపఁగఁ గొంతవచ్చుఁ బ్రౌఢులకుఁ గథా
ప్రచయము పద్యములన పొం
దుచితముగఁ జెప్ప నార్యు లొప్పిద మనరే.”
అనుపద్యమును వ్రాయుటయే వచనము లేకుండ వర్ణనసేయుట ప్రౌఢకవిలక్షణముగా భావించె ననుటకు నిదర్శనముగా నున్నది.
మఱియును 'అమలోదాత్తమనీష, నేనుభయకావ్య ప్రౌఢిశిల్పమునం బారగుఁడం గళావిదుఁడ' నన్నపలుకు ప్రౌఢకవి నోటనుండి వినంబడునుగాని యప్రౌఢుఁడగు బాలకవి నోటనుండి వినంబడునా? ఉత్తరరామాయణము రచించుటయందుఁ దిక్కనయుద్దేశము సరసమైన కావ్యమును వ్రాసి మనుమసిద్ధికిఁ