Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ యధ్యాయము

నిర్వచనోత్తర రామాయణము.

మేరులెత్తినను సరేశ్వరువర్తనము రత్నాకరవేష్టితావని వినంబడదని యెఱింగినవాఁడుగాన తిక్కనకవిచేఁ గృతినొందవలయు ననుకోరికగలవాఁడై మనుమసిద్ధి యొకనాఁడు తిక్కనమనీషిం బిలువ నంపించి 'నిన్నుమామాయని నేను బిలుచుచున్నందుకు నీవు నాకు భారతీకన్య నొసంగ నర్హుఁడవైయున్నాఁడ' వనిపలికెను. ఆపలుకు తనమనస్సున కింపు పుట్టించె నని,

"క. ఏ నిన్ను మామ యనియెడు
    దీనికిఁ దగ నిమ్ము భారతీకన్యక నా
    కీ నర్హుఁడ వగు దనినను
    భూనాయకుపలుకు చిత్తమున కింపగుడున్".

అను పద్యముమూలమునఁ దిక్కన తేటపఱచి యున్నాఁడు. దీనినిబట్టి తిక్కనకవికి మనుమసిద్దిరాజునకుఁ గృతి నొసంగుకోరిక యదివఱకు లేదనియు నతఁడు పలికిన చమత్కారపుం పలుకు మనస్సున కానందము గలిగించుటచేతఁ గృతి నిచ్చినట్లును స్ఫురించుచున్నది. ఇట్లు మొదట సమ్మతిలేకయున్నను మనుమసిద్ధికులశీల స్వరూపాదులం దలంచుకొని