ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఆఱవ యధ్యాయము
71
తరువాత మనుమసిద్ధియు సైన్యసమేతముగాఁ గాటమ రాజుపై డండెత్తిపోయి యుద్ధముచేసి వీరస్వర్గమును జూఱఁ గొనియెను. అటుపిమ్మట దానుబొందినగాయములవలనఁ గాటమరాజుగూఁడ స్వర్గస్థుఁ డయ్యె నఁట. పుల్లరినిగూర్చినయుద్ధ మీవిధముఁ బర్యవసిత మయ్యెను. మనునుసిద్ధి స్వర్గస్థుఁడైనపిమ్మట నీదేశమును గాకతీయాంధ్ర చక్రవర్తిసైన్యాధిపతి యగుదాదినాగన్న నాగదేవమహారా జనునామముతో గొంతకాలము పరిపాలించెను.