Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

తిక్కన సోమయాజి


ములు దేహమును విడిచిపోయినవిధము నాకవివర్యుఁడే యిట్లు చెప్పి యున్నాఁడు.

"సీ. నందిని బుత్తెంచె నిందుశేఖరుఁడు నీ
            వన్న యేతెమ్ము తారాద్రికడకు
    గరుడుని బుత్తెంచె నరహరి రావయ్య
            వడి సిద్ధతిక్క! కైవల్యమునకు
    హంసను బుత్తెంచె నజుఁడు నీడకు ను
            భయకులమిత్ర రా బ్రహ్మసభకు
    నైరావతముఁ బంపె నమరేంద్రు డిప్పుడు
            దివముస కేతెమ్ము తిక్కయో ధ,

గీ. యనుచు వేఱువేఱ నర్థితోఁ బిలువంగ
   వారు వీరు గూడ వచ్చి వచ్చి
   దివ్యయోగి యైనతిక్కనామాత్యుండు
   సూర్యమండలంబుఁ జొచ్చి పోయె."

మఱియును విక్రమసింహపుర నివాసులైన పౌరులెల్లరును ఖడ్గతిక్కనమరణవార్తను విని తాము వానిని బరిహసించి యపచారము చేసినందులకుఁ బశ్చాత్తప్తు లగుచు నాతనిగుణగణంబులు దలపోసికొని దుఃఖాక్రాంతచిత్తులై,

"ఉ. వెన్నెలలేని రాత్రియు రవిప్రభలేనిదినంబు నీరులే
     కున్న సరోవరంబు కడు నొప్పగుదీపములేక యున్నయిల్లు పై
     విన్న 'దనంబు నొందె మనవిక్రమసింహపురంబు చూడఁగాఁ
     బున్నమచంద్రుఁబోలు మనపోలమతిక్కఁడు లేమినక్కటా!

అని పరిపరివిధముల విలపించి రఁట. ఆహా! వీరవర్వులయు కవివర్యులయు చావు లెవ్వరికి నేడ్పుఁ బుట్టింపవు?