Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయిదవ యధ్యాయము

57


యుద్ధముచేసి వారలను దఱిమి. మరల చోడుని సింహాసనమునఁ గూరుచుండఁబెట్టి చోళస్థాప నాచార్యబిరుదము నందె నని యిదివఱకె తెలిపియున్నాఁడను. తిక్కరాజు మరణానంతరము పాండ్యులు తమతొంటి పూనికను విడనాడక కాంచీపురము మొదలుకొనియుత్తరభూమిని జయింపఁగోరి పలుమాఱుదాడి వెడలి వచ్చి నెల్లూరునకు దక్షిణభాగమునను, పశ్చిమపాక నాడును, మార్జవాడిదేశమును గల్లోలపెట్టుచుండిరి. తనసామంతుల ప్రార్థనముమీఁద గణపతిదేవచక్రవర్తి కీ. శ. 1249 సంవత్సరమున నసంఖ్యాకము లైనసైన్యములతో గాంచీపురముపై దండెత్తిపోయి మారవర్మసుందరపాండ్యుని వాని కుమారుఁడైన జటవర్మసుందర పాండ్యుని నోడించి యచటినుండి పాఱఁద్రోలి తనసచివాగ్రణియు, సైన్యపాలుఁడును, చక్రధారియు, కాశ్యపసగోత్రుఁడు నైన సామంతభోజమంత్రిని గాంచీపురపాలకునిగా నియమించి నటు లేకాంబరేశ్వరుని దేవాలయములోని యొకశాసనమునలనఁ దెలియుచున్నది.[1] కాకతీయగణపతిదేవచక్రవర్తి దక్షిణదిగ్విజయ యాత్రను ముగించి రాజధాని యగునోరుగల్లు చేరినవెనుక మఱుసటి సంవత్సరమున జటవర్మసుందర పాండ్యమహారాజు మరల దండయాత్ర వెడలి కాంచీపురమును, విక్రమసింహపురమును ముట్టడించి స్వాధీన పఱచుకొని మనుమసిద్దిరాజును బాఱఁద్రోలి సిద్దిరాజునకు

  1. The Indian antiquary, Ekamrautha Inscription of Ganapathi. Vol. XXI, p. 107, No. 15. Ganapeswaram Inscription of the time of Ganapati.