పుట:Tikkana-Somayaji.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

తిక్కన సోమయాజి


1257 వ సంవత్సరమునకును, 1260 వ సంవత్సరమునకును నడుమ నీచరిత్రము నడచి యుండవలయును. గణపతిదేవచక్రవర్తి మనుమసిద్ధిరాజునకు సాహాయ్యముఁ జేయఁ బూని మార్గమధ్యమున వెలనాటిరాజును జుయించి యప్పనము గైకొనియె నని సిద్దేశ్వరచరిత్రము నందుఁ జెప్పఁబడి యున్నది. కాని గణపతిదేవచక్రవర్తి 1228 దవ సంవత్సరమునాటికె వెలనాటిని సంపూర్ణముగా జయించెను. అప్పుడు నెల్లూరును బరిపాలించుచున్నవాఁడు మనుమసిద్దితండ్రి యగుతిక్కరాజు గాని మనుమసిద్ధిరాజు గాఁడని స్పష్టముగాఁ జెప్పవచ్చును. పైని జెప్పినట్లుగా 1257-1260 సంవత్సరముల నడుమమనుమసిద్దిరాజు రాజ్యమును గోలుపోయి యుండరాదా యని తలంతుమేని 1258-1259 సంవత్సరములలో రాజ్యూభివృద్ధికై మనుమసిద్ధి రాజుచేతనునాతనిక్రింది యధికారప్రభువు లైనపల్లవ రాజులచేతను జేయఁబడినదానములను గూర్చినశాసనములు పెంట్రాలలోఁ గానం బడుచున్నవి. కావున నాకాలమున మనుమసిద్దిరాజు పదభ్రష్టుఁ డయ్యె నని తలంపరాదు. అట్లయిన పక్షమున మనుమసిద్ది యెప్పుడును పదభ్రష్టత్వమును బొందనేలేదా యనుశంక పుట్టవచ్చును. మనుమసిద్దిరాజు పదభ్రష్ఠుడైన కాలము గూడఁ గలదు. మనుమసిద్ధితండ్రి యగు తిక్కరాజు కాలమునఁ బాండ్యులు కాంచీపురముపై దండెత్తివచ్చి యారాజ్య మాక్రమింపఁగాఁ దిక్కరాజు పాండ్యులతో