పుట:Tikkana-Somayaji.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయిదవ యధ్యాయము

55


తమా? అట్లయినపక్షమున భారత మెప్పుడురచించిననాఁడనుప్రశ్నము జనించును. దశకుమార చరిత్రమును కేతన రచించి తిక్కన కంకితముచేసిన కాలమునకుఁ బూర్వమె తిక్కన యనేకయాగములను జేసి యున్నట్లు 'మహితదక్షిణ లైన బహువిధయాగంబు లొనరించుననుట వర్ణపము దారి' అనియు 'అధ్వరాబ్జదిననాధునకున్' అనియు, 'యాగవిద్యాభిరామా' అనియు మొదలుగాగల వాక్యములను దశకుమారచరిత్రమునందు కేతనకవి తిక్కన గూర్చి ప్రయోగించి వాడియుండుట చేతనే విస్పష్టమగుచున్నది. గణపతిదేవ చక్రవర్తి క్రీ. శ. 1260 వ సంవత్సరమున స్వర్గస్థుఁ డైనట్లు గన్పట్టుచున్నది. ఆ సంవత్సరమునకుఁబూర్వమె యీకథ నడచియుండవలయును. కడపమండలములోని నందలూరు శాసనములలో నొకదాని యందు మనుమసిద్దిరాజు కోడూరు గ్రామమును 1257-వ సంవత్సరమున బ్రాహ్మణులకు దానము చేసి నట్లుగఁ జెప్పఁబడి యున్నది. ఆశాసనములోనే మనుమసిద్దిరాజు కాకతీయ గణపతిదేవునితో స్నేహము సంపాదింపవలయు నని కోరిక కలిగియున్నట్టుగఁ దెలుపఁ బడినది. కనుక సిద్దేశ్వర చరిత్రము నందు చెప్పఁ బడినట్లు గణపతిదేవచక్రవర్తి అక్కనబయ్యనలను జయించి మనుమసిద్ధికి రాజ్యమిప్పించి రాజ్యమహిమలు దెలిపినది 1257 వ సంవత్సరమునకుఁ బూర్వము కాదని పై నందలూరు శాసనమువలన నూహింపవచ్చునుగదా ! అనఁగా