Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

తిక్కన సోమయాజి


జగ్గకవి పదునెనిమిదవశతాబ్దిలో నుండిన వాఁడు. ఈరెండు గ్రంథములే పై నుదాహరించిన కథకు మూలాధారము లై యున్నవి. ఈచరిత్రములందు చరిత్రమునకు విరుద్ధము లైన యనేక విషయములు చొప్పింపఁబడి యున్నవిగాన కేవలము వానినే నమ్మి పరమసిద్ధాంతములనుగాఁ గైకొనరాదు. ప్రస్తుతము పై నుదాహరించిన చరిత్రాంశములను విమర్శింతము.

ఈచరిత్రములో నుదాహరింపఁబడిన మనుమసిద్ధి దాయాదు లగు అక్కనబయ్యన లనువా రెవ్వరో వారిచరిత్ర మెట్టిదో దెలియరాదు. వీరిశాసనము లెవ్వియును గానరావు. మనుమసిద్ధికిఁ బూర్వమునను తరువాతను మాత్రమేగాక మనుమసిద్ధికాలమునను విక్రమసింహపురమునను, తత్సామీప్య గ్రామములందును మహారాజుల పేరిటఁ బెక్కు శాసనములు లిఖంపఁబడి యుండఁగా వీరిపేరిట శాసనములు గానరాకుండుటచేత వీరినామము లెవ్వరికి మాఱుపేరులోఁ దెలియరాకున్నది. ఇంతప్రాముఖ్యమును గాంచిన చరిత్రాంశమును కేతనకవి తాను తిక్కనసోమయాజి కంకితముచేసిన దశకుమారచరిత్రముసం దైన నుదాహరించినవాఁడు గాఁడు. దశకుమారచరిత్రము రచింపఁబడు నప్పటికి నిది జరిగి యుండలేదని తలంచుకొందు మన్న మఱియెప్పుడు జరిగియుండు ననుప్రశ్నము రాఁ గలదు. తిక్కన యజ్ఞములు చేసి సోమయాజి యై భారత మాంధ్రీకరించినవెనుక నిట్టిది సంభవించిన దని యూహిం