అయిదవ యధ్యాయము
53
సీ. గణపతిదేవుఁ డాఘనువసుమతి గాంచి
యతిసత్వరమునఁ బ్రయాణభేరి
వేయించి చతురంగపృతనాసమేతుఁ డై
తరలి మున్వెలనాటి ధరణిపతుల
గెలిచి వారలచేత లలి నప్పనము,
గొని బారి నందఱ దనవశము జేసి
కొని చని నెల్లూరు గొబ్బునఁ జొచ్చి య
క్కనయు బయ్యనయు న౯ ఖలులఁ దఱిమి
మనుమసిద్ధిరాజుఁ బున రభిషిక్తుఁ గా
నించి మించి రెండువేలు నైదు
నూఱు గ్రామములు మనోవృత్తి కతనికి
నిచ్చి కడమఁ దాను బుచ్చుకొనియె.
(సోమదేవరాజీయము)
విమర్శనము.
సిద్ధేశ్వరచరిత్ర మనునది యొక శైవగ్రంథము. దీనికిఁ బ్రతాపచరిత్ర మనునామాంతరము గలదు. కాసె సర్వ ప్పను నాతఁడు దీనిని ద్విపదకావ్యమునుగా రచియించెను. ఈగ్రంథము పురాతన మైనదయినను లక్షణదోషములు పెక్కులు గాన వచ్చుచున్నవి. ఈకవికాల మెప్పుడో మనకు నిశ్చయముగాఁ దెలియరాదుగాని గణపతిదేవునకు నూఱుసంవత్సరముల తరువాత నున్నవాఁ డని తోఁచుచున్నది. ఈసిద్దేశ్వర చరిత్రమునుబట్టియే సోమదేవరాజీయము కూచిమంచి జగ్గకవి చే రచియింపఁబడి మందపాటివారి కంకితము గావింపఁ బడినది.