నాలుగవ యధ్యాయము
47
యుఁ డై యినంబ్రోలువాసులైనవెలమలకు వర్తమాన మంపి పాక నాటిలోని ప్రజల సాహాయ్యమును బడసి వారివివాదమును గూర్చి విమర్శ జరిపెను. ఆవిమర్శలో నాభూములు
బ్రాహ్మణుల వైనటులు దేలినందున వీరరాజేంద్ర చోడచక్రవర్తి యొక్క పదుమూఁడవ సంవత్సర పరిపాలనకాలమున అనఁగా శా. శ. 1179 (క్రీ. శ. 1257-58) దవ సంవత్సరమునఁ దనతండ్రి తిరుకాళ దేవమహారాజు పుణ్యముకొఱకు మనుమసిద్దిరాజు కోడూరు గ్రామమును బ్రాహ్మణులకు దానము చేసెను. ఈ విషయములు కడపమండలములోని నందలూరి యఱవశాసనములలో నొకదాని వలనఁ దేటపడుచున్నవి.[1] దీనిం బట్టి పదుమూఁడవశతాబ్దికిఁ బూర్వము పాకనాటిలో మహామారిజ్వరము (ప్లేగు) గాని, అటువంటిదే మఱియొక యంటువ్యాధిగాని వ్యాపించి యుండె ననియు, అట్టి స్వగృహములను విడిచిపెట్టి పొలములలో గుడిసెలు వేసికొని కాపుర ముండుట క్షేమకర మని ప్రజలు తెలిసికొని యున్నా రనియు బై శాసనములలోని విషయములు స్పష్టముగఁ దెలుపుచున్నవి. ఈశాసనములో నుదాహరింపఁ బడినకోడూరు గ్రామము కడపమండలము లోనిపుల్లంపేట తాలూకాలో నున్నది. పేరం గండూరు గ్రామ మిప్పుడు గానరాదు. పైశాసనములో మనుమసిద్దిరాజు వీరరాజేంద్రచోడ చక్రవర్తికి సామంతుఁడుగ నున్నటులు గనం బడుచున్నను స్వతంత్రుఁ డై పరిపాలనము చేయుచుండెనని మన మూహింప వచ్చును.
- ↑ Annual Report on Epigraphy of 1907 No. 580