పుట:Tikkana-Somayaji.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగవ యధ్యాయము

41


"తిక్కరాజు మరణానంతరము పాండ్యరాజులు తమతొంటి పూనికను విడనాడక కాంచీపురము మొదలుకొని యుత్తర భూమిని జయింపఁ గోరి పలుమాఱు దాడి వెడలి వచ్చి నెల్లూరునకు దిగువ నున్న దేశమును గల్లోలపెట్టు చుండిరి. వారిలో జటవర్మ సుందరపాండ్య మహారాజు ప్రముఖుఁడుగా నుండెను. కీ. శ. 1249-వ సంవత్సరమునఁ గాకతీయగణపతిదేవ చక్రవర్తి యాంధ్రదేశము నుండి పాండ్యరాజులను బాఱఁద్రోలి కాంచీపురమున నొకదేవాలయములో నొకదానశాసనమును [1] వ్రాయించెను. అయినను జటవర్మ సుందరపాండ్య మహారాజు మఱుసటి సంవత్సరమునం దనఁగా 1250-దవ సంవత్సరమునఁ గాంచీపురమార్గమున నాంధ్రదేశముపై దండెత్తివచ్చి, తెలుఁగుచోడరాజులను జయించి మనుమసిద్దిరాజును నెల్లూరునుండి పాఱఁ ద్రోలి సిద్ధిరాజునకు శత్రువు లైన వీరులను పట్టాభిషిక్తులను గావించి నెల్లూరిలోని పళ్లికొండ పెరుమాళ్ళదేవునకు మండనాటిలోని మావడికుండ గ్రామమును దానము చేసె నని తెలిపెడిశాసన మొకటి రంగానాయకస్వామి దేవాలయములో నొక స్తంభము పై వ్రాయించెను. [2] ఆ సంవత్సరముననే విజయగండ గోపాలదేవుఁడు కాకతీయుల సాహాయ్యమును బడసికాని పడయకకాని జటవర్మసుందరపాండ్యదేవుని వానిసైన్యములను నెల్లూరిమండలమునుండి పాఱఁద్రోలి యుండవలయును. ఈవిజయగండగోపాలునినే తరువాత మనుమసిద్ది యెదిరించి పోరాడి విజయమును గాంచి యుండవచ్చును, విజయక్ష్మాధీశ్వరుఁడు జయించిన ద్రవిడోర్వపతి జటవర్మ సుందరపాండ్యుఁడుగాక కాంచీపురాధిపతియైన మూఁడవవీర రాజేంద్ర చోడచక్రవర్తియే యైన యెడల 1250-వ సంవత్సరమునకుఁ బూర్వముననే మనుమసిద్ధి వానిని జయించి యుండవలయును. పైనఁ జెప్పినదే వాస్తవమైనయడల 1250 వ

  1. Indi Ant. Vol. XXI. p. 202; Ep-Ind. Vol. VII. No. 588, Kielhorn's. List of inscriptions of Southern India.
  2. 2 Nellore Inscriptions, Vol. II. No. 61.