Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

తిక్కన సోమయాజి


మనుమసిద్దినాటి కాలస్థితి

పదుమూఁడవ శతాబ్దిప్రారంభము నుండి యాంధ్రదేశమునఁ జూళుక్యచోడ చక్రవర్తుల యధికారము నశించిపోయి కాకతీ యాంధ్రచక్రవర్తుల యధికారము నానాముఖముల వ్యాప్తిజెందు చుండె నని చెప్పవచ్చును. చాళుక్యచోడ చక్రవర్తి యగు మూఁడవరాజరాజచోడునకును, మూఁడవ రాజేంద్రచోడునకును సింహాసనమును గూర్చి పోరాటములు జరుగు చుండెను. ఈ పోరాటములలో ద్రావిడాంధ్రకర్ణాటకు లేదేని యొకపక్షమునఁ జేరి రెండవపక్షముతోఁ బోరాడు చుండిరి. మనుమసిద్దితండ్రి యగుతిక్కరాజు కర్ణాటకులను ద్రావిడులను జయించి రాజరాజచోడుని రాజ్యమున నిలిపి కొంతకాలముఁ బరిపాలనము చేసెను గాని వాని మరణానంతరము రాజేంద్రచోడుఁడు విజృంభించి పాండ్యులను కర్ణాటులను జయించి రాజరాజును జంపి కాంచీపురసింహాసన మాక్రమించుకొని పరిపాలనము సేయు చుండెను. క్రీ. శ. 1299 -వ సంవత్సరమున నేకశిలానగరమునఁ బట్టాభిషిక్తుఁ డై గణపతిదేవచక్రవర్తి 1240 వ సంవత్సరమునాటికే వెలనాడు, పొత్తపినాఁడు, రేనాడు, ములికినాడు, గండికోట మార్జవాడిసీమలను జయించి ద్రావిడకర్ణాట రాజులతోఁ బోరాడుచుండెను. ఆకాలమున దక్షిణహిందూ స్థానమునఁ దమ సామ్రాజ్యములను స్థాపింపఁ బూని దేవగిరి యాదవులును, ఓరుగంటి కాకతీయులును, హలెవీటి , హెయిసనులును, మధురాపుర పాండ్యులును,