Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

తిక్కన సోమయాజి


ఇతని పెదతండ్రికుమారుఁ డగు ఖడ్గతిక్కనయు నితనివలెనే, సమస్త సంపత్సమేతుఁడై తమ్ములతోడను, గొమాళ్ళతోడను రాజ్యసుఖంబు లనుభవించు చుండెననుట సత్యవిరుద్ధము కాదు. కేతనకవి తిక్కనకవివంశ వర్ణనముఁ జేయు నపుడు సిద్ధనా మాత్యనందనుఁ డగు ఖడ్గతిక్కన నిట్లభివర్ణించి యున్నాఁడు.

"సీ. వేడిన నర్థార్థి వృథపుచ్చ నేరని
           దానంబు తనకు బాంధవుఁడు గాఁగ
    నెదిరిన జమునైన బ్రదికిపోవఁగ నీని
           శౌర్యంబు తన కిష్టసఖుఁడు గాఁగ
    శరణుచొచ్చిన శత్రువరు నైన రక్షించు
           కరుణయె తనకు నంగదము గాఁగ
    బలికినఁ బాండవప్రభు నైన మెచ్చని
           సత్యంబు తనకు రక్షకుఁడు గాఁగ

    జగతి నుతి కెక్కె రాయవేశ్యాభుజంగ
    రాజ్యరత్నాకరస్ఫూర్తి రాజమూర్తి
    గంథవారణబిరుద విఖ్యాతకీర్తి
    దినపతేజుండు సిద్ధయ తిక్క శౌరి."

మఱియును సిద్ధయ తిక్కనామాత్యుని గృహము ప్రతిదిన మెట్లుండునో యావివరమును మఱియొక కవి

"సీ. వీరవివాదంబు వేదనినాదంబు
          పాయక యేప్రొద్దు మ్రోయు చుండు
    భూసురప్రకరంబు సేసలు చల్లంగ
          బాయ కెన్నియొ కుటుంబములు బ్రదుకు