Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

తిక్కన సోమయాజి


నశించి పోయిరి. కవితిక్కనమూలమున మనుమసిద్ది యెట్టివాడో మనకుఁ దెలిసికొనుట సంభవించినది. తిక్కరాజు కాలమునందే మనుమసిద్ది భూపాలునకును కవితిక్కనకును మైత్రిసంభవించినది. తనపెదతండ్రి సిద్ధనామాత్యుఁడు తిక్కరాజునకు మంత్రిగ సేనాపతిగ నుండుటంజేసి కవితిక్కన మనుమసిద్దిరాజుతో మైత్రి నెఱపుటలో వింత యేమియునులేదు.

సిద్దనామాత్యునికి గల నేడ్వుర పుత్త్రులలోను జ్యేష్ఠుడగు తిక్కనామాత్యుఁడు మనుమసిద్ది భూపాలునకు మంత్రిగను సేనాపతిగ నుండెను. ఈ తిక్కనామాత్యునితమ్ములు మూవురును కొమా ళ్ళిరువురును మనుమసిద్దిభూపాలుని కొల్వుననే యుండిరి. కొట్టరువువారి కుటుంబము చాల గొప్పది. ఈ తిక్కనామాత్యునినే యిటీవలివారు ఖడ్గతిక్కనయని వ్యవహరించు చున్నారు. వీనితోఁ బాటు కవితిక్కనగూడ మనుమసిద్ధి భూపాలునికడ మంత్రిగను సేనాపతిగఁ గూడ నుండెను. మనుమక్ష్మాసాలమంత్రి మాణిక్యుఁడనియు, మనుమసిద్దిమహీశ సమస్తరాజ్యభార ధౌరేయుఁ డనియు, గవితిక్కనను వర్ణించి ఖడ్గతిక్కనను గేతనయట్లు చెప్పకుండుటచేత ఖడ్గతిక్కనకంటెను గవితక్కన మనుమసిద్ధికి నథికకరుణాపాత్రుం డయ్యె నని చెప్పవలసి యుండును. మనుమసిద్ధి విద్యాగంధములేని మూర్ఖుఁడు గాఁడు. ఇతరు లాడించి నట్లాడుటకు వారిచేతిలోని జంత్రపుబొమ్మగాఁడు. కేతసకవి సుకృతాత్ముఁ డైనమనుమసిద్ధిని