పుట:Tikkana-Somayaji.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

తిక్కన సోమయాజి


మండలవాసులలో నంతగాఁ గానంబడదు. ఆహేతువుచేత తిక్కన జన్మస్థానము కాళహస్తికి సామీప్యమున నుండు నెల్లూరే యనుట కెక్కువహక్కు గలదు గాని నెల్లూరే జన్మస్థాన మని నిర్దేశించుటకు బలవత్తరమగు రుజు వంతకంటె నధికము గానరాదు. అయినను తిక్కన జన్మస్థాన మిదియని సహేతుకముగా నిర్ధారించుటకుఁ జాలినంతలిఖితమూలము లభ్య మగునంతవఱకును జన్మస్థాన మిదమిత్థ మని నిశ్చయింపఁ జూలను. కాని తిక్కనసోమయాజి నిజస్థానము నెల్లూరని ఘంటాపధముగఁ జాటవచ్చును. తిక్కనజన్మస్థాన మెద్దియైనను తిక్కన వాసస్థలము నెల్లూరు కాదను వాదము గూడఁ గలదు. ఆవాదమునుగూడ విమర్శింతము. ఇట్టివాదము 'కవిజీవితము' లనుగ్రంథమునందుఁ గానంబడు చున్నది. అం దిట్లున్నది.

"నెల్లూరుప్రభుఁ డగుమనుమసిద్ధిరాజు పేరిట సోమయాజి తననిర్వచనోత్తరరామాయణము కృతియిచ్చుటం జేసియు, భారతము హరిహరనాధుని పేరిటఁ గృతియిచ్చుటచేతను నీతఁడు. నెల్లూరు వాసస్థుఁ డనువాడుక కల్గినది. ఇందు మొదటిగాథను బట్టి అక్కడ నివాసము స్థిఱపఱుప వీలు లేదు. ఫూర్వము కవీశ్వరులు దేశదేశములు తిరిగి, ఎక్కడరసికు లగు ప్రభువు లుందురో అక్కడఁ గొన్నిదినంబు లుండి యాప్రభుని కొకకృతి యిచ్చి బహుమతుల నంది మరల స్వస్థలమునకుఁ బోవుచుండు నాచారము గలదు. అటులనే సోమయాజియుఁ జేసి యున్నాఁడని అతని రెండవగ్రంథమగుభారతములో మనుమసిద్ది యాస్థానములోని వాడ నని యుచ్చరింపఁ బడకపోవుటచేత నిస్సంశయముగాఁ జెప్ప నొప్పియున్నది. ఇఁకరెండవ శంకకు సమాధాన మెట్లన్న భారతములో స్మరింపఁబడిన హరిహరనాధుఁ