రెండవ యధ్యాయము
19
డైనటులు గనం బడుచున్నది. "ఎవ్వఁడు శ్రీవరదరాజస్వామి చరణసరోరుహములను బూజింపుచున్నాఁడో అతఁడే నాకుఁ దల్లియుఁదండ్రియు, గురువును, ధనమును, పుత్త్రుఁడును మిత్రుఁడు నగుచున్నాఁ" డనిచెప్పి అరుళాళప్పెరుమాళ్ళ దేవాలయములో నొకశాసనమున వ్రాయించుట యే యిందుకు దృష్టాంతము. ఇతఁడు వైష్ణవమ తావలంబకుఁ డయినను పరమతసహనము గలిగి యుండి నట్లే గానం బడుచున్నాఁడు. తిక్కన సోమయాజి మూఁడవ పెద్దతండ్రి యగుసిద్ధనామాత్యుడు. తిక్క రాజునకు మంత్రిగనుండి యతనిమరణానంతరముఁ గూడఁ గొంతకాలము వఱకు జీవించి యుండి నట్లు గనంబడుచున్నది. తిక్క రాజునకు గరికాలభూవిభుఁ డనినామాంతరముగలదనియు, ఇతఁడు విద్వాంసుఁడై , కవిసార్వభౌమ బిరుదమును వహించి యుండె ననియుఁ గూడ నిర్వచనోత్తర రామాయణములో
"సీ. భృత్యానురాగంబు పెంపుఁ జెప్పఁగ నేల
పరివారసన్నాహ బిరుదు గలుగ,
వందిప్రియత్వంబు వర్ణింపఁ గానేల
పాఠకపుత్రాఖ్య పరగు చుండ
సకలవిద్యాపరిశ్రమముఁ దెల్పఁగ నేల
కవిసార్వ భౌమాంక మవనిఁ జెల్ల,
సుభగతామహిమఁ బ్రస్తుతి సేయఁగా నేల
మన్మథనామంబు మహిమ నెగడ,
గీ. నుభయబల వీరుఁ డను పేరు త్రిభువనములఁ
బ్రచురముగఘోరబహుసంగరముల విజయ