పుట:Tikkana-Somayaji.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ యధ్యాయము

17


చోడస్థాపనాచార్యబిరుదమును బొంది యవక్రలీలను గాంచీపురమును గూడఁ బరిపాలించెను. ఈవిషయమునే తిక్కనసోమయాజి తననిర్వచనోత్తర రామాయణముస,

“మ. కమలాప్తప్రతిమానమూర్తి యగు నాకర్ణాటసోమేశు దు
     ర్దమదోర్గర్వము రూపుమాపి నిజదర్పంబుం బ్రతిష్ఠించి లీ
     లమెయిం జోళుని భూమిపై నిలిపి చోళస్థాపనాచార్య నా
     మము దక్కంగొని తిక్కభూవిభుఁడు సామర్థ్యంబు చెల్లింపఁడే?"

అనుషద్యములో స్పష్టముగా వివరించి యున్నాఁడు.

కేతనకవికూడ తనదశకుమారచరిత్రమున సవతారికలో

"సీ. బలిమిచేఁ బృథ్వీశువసుధేశు తలఁ ద్రుంచెఁ
             గటకసామంతుల గర్వ మడచెఁ
    గాళవవిభు నహంకారంబు మాన్పించెఁ
             బాండ్యునిచేతఁ గప్పంబుఁ గొనియె
    ద్రవిడమండలికు లందఱఁ చక్క గెలిచి చో
             డని నిజరాజ్య పీఠమున నిలిపె
    వెఱుకుమన్నీల నివ్వెఱ పుట్టఁగా నేలె
             వైరివీరుల నామలూరు నోర్చె
    యోధ హరిరాయ పెండ రుభయకటక
    వీరుఁ డభినవభోజుఁ డాకారమదనుఁ
    డవనిభారధౌరేయమహాత్మవిజిత
    దిక్కరీంద్రుఁడు ఘనచోళతిక్కనృపతి."

అనుపద్యమునఁ దిక్కరాజు పృథీశ్వరరాజు తలఁ ద్రుంచె నని చెప్పి యున్నాఁడు. కాంచీపురములోని అరుళాళప్పెరుమాళ్ళ యాలయములో క్రీ. శ. 1233-34-గవ సంవత్సర