Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

తిక్కన సోమయాజి


మూఁడవ కులోత్తుంగ చోడునకు లోఁబడి యున్నవాఁడు నటించినను స్వతంత్రుఁడై పరిపాలనము చేసెను. తిక్కరాజు మూడవ కులోత్తుంగచోళుని గడపటి కాలమున మాత్ర ముండి యతని మరణానంతరము స్వతంత్రుఁడయినట్లు గన్పట్టు చున్నది.

ఇతఁడు స్వతంత్రుఁ డైనవెనుక చోడసింహాసనమునపై చాళుక్యచోడులలో మూఁడవరాజరాజున కును మూఁడవరాజేంద్ర చోడునకును తగవులు గలిగి పరరాజుల సహాయమును గోరి యిరుపక్షములవారును బోరాడుటచేత గాంచీపురము పల్మాఱు సంక్షోభమున కాకర మగుచు వచ్చెను. కర్ణాట దేశమును బరపాలించు వీరసోమేశ్వరుఁడు (హోయిసలరాజు) రాజేంద్రచోడునిపక్షమును, మన యీతిక్కభూపాలుఁడు రాజరాజుపక్షమును బూని యుద్ధములు చేయుచువచ్చిరి. కర్ణాటవీర సోమేశ్వరుని తోబుట్టువుకుమారుడును, (మేనల్లుఁడు) పాండ్యమండలాధిపతియు నగు రెండవ మారవర్మ సుందరపాండ్యుఁడును, మహాబలి పురాధీశ్వరుండును, పల్లవరాజు నగుకొప్పరిం జింగదేవుఁడును (మహారాజసింహుఁడు) అనగా ద్రావిడులుఁ గర్ణాటులు నొక్కవంకను, తెలుఁగుచోడు లొక్కవంకను జేరి ఘోరయుద్దములు జేసిరి. ఈ యుద్ధములలో మొదట తిక్కరాజునకే విజయము గలిగెను. తిక్కభూపాలుఁడు కదనరంగమున శత్రువుల నోడించి రాజరాజచోడుని సింహాసనము నందు నిలిపి