Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ యధ్యాయము

13


యాంధ్రకవుల చరిత్రయం దట్లు వ్రాసి యున్నారు.[1]ఈబిజ్జన సూర్యవంశ్యుఁడు. కళ్యాణపురాధీశ్వరుఁ డైనబిజ్జలుఁడు చంద్ర వంశ్యుఁడు. కావున వీరిరువురకు నేవిధ మైనసంబంధమును లేదు. తిక్కన యీబిజ్జనను

"చ. పరుషపరాక్రముం డగుచుఁ బల్లవువీట నుదగ్రు లైన ప
     న్నిరువురు నాతనిం గలయ నెన్ని యనర్గళమత్సరంబు మై
     మురరిపుసన్ని భుండు పదుమువ్వుర గండడగంగఁ బెట్టెఁ దా
     బిరుదు వెలుంగ బిజ్జఁ డరిభీకరభూరిభుజాబలంబునన్."

అని యభివర్ణించి యున్నాఁడు.

ఈబిజ్జన ఊజ్యపురియందు, శిఖరమున గరుడవిగ్రహము గలిగి యుండు నట్టి విజయస్తంభము నొకదాని నిర్మించె నని యొక శాసనమున లిఖియింపఁ బడియెను.[2] ఈబిజ్జనవంశమునందే మనుమసిద్దిరాజు జనించి విశ్రుతిఁగాంచెను. ఇతఁడు చాళుక్య చోడచక్రవర్తి యైన మూఁడవకులోత్తుంగ చోడునకుఁ గప్పము

  1. కందుకూరి వీరేశలింగ కవికృతి గ్రంథములు, సంపుటము, 10 భాగము 1, పేజీ 47, (1911-వ సంవత్సర ముద్రితగ్రంథము.)
  2. కోయంబుత్తూరు మండలములో కొల్లేగాలము అను స్థలమునకు 18 మైళ్ళదూరమున నున్న ఉజ్జపురమే ఊజ్యపుర మని డాక్టరు లూడర్సు గారు నిర్ధారణ చేసి యున్నారు. అయినను నెల్లూరిమండలములో సుళ్లూరుపేట డివిజనులో ఉచ్చూరు. ఆనెడిగ్రామ మొకటి కలదు. ఇచ్చటి యఱవశాసనములలో ఈగ్రామము ఉచ్చియూ రనివాడఁ బడి యున్నట్లుగా శాసనపరిశోధకులు వ్రాయుచున్నారు.