పుట:Tikkana-Somayaji.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదటి యధ్యాయము

7


రాజున కాప్తమంత్రియు సేనాపతియు నై యుండె నని దశకుమార చరిత్రములోని,

"ఉ. స్థాపితసూర్యవంశ వసుధాపతినాఁ బరతత్వధూతవా
     ణీపతినా నుదాత్తనృపవీతి బృహస్పతినా గృహస్థగౌ
     రీపతినా గృపారససరిత్పతినాఁ బొగఁ డొందె సిద్ధిసే
     నాపతి ప్రోడ తిక్కజననాథ శిఖామణి కాప్తమంత్రియై."

అనుపద్యములో విస్పష్టముగా వివరింపఁబడి యున్నది. సిద్ధనామాత్యుఁడు తిక్కరాజునకుఁ మంత్రిగా నుండె ననితెలిపెడి శాసన మొకటి నెల్లూరుమండలమునఁ గలదు.[1] సిద్ధనామాత్యుఁడు తిక్కరాజునకు మంత్రియు సేనాపతియు నై యుండ వానితమ్ముఁడైన కొమ్మనామత్యుఁ డెక్కడనో గుంటూరున నూరును బేరును లేకుండఁ గరిణీకముఁ జేసికొనుచుఁ గూరుచుండెననుట విశ్వాసపాత్రము గాదని వేఱుగ నొక్కి వక్కాణింప నక్కర లేదు. మంత్రిభాస్కరుని వంశము పదుమూఁడవ శతాబ్దిలో బ్రఖ్యాత మైనదనుట సత్యమునకు విరుద్ధముగాదు. మంత్రిభాస్కరునితండ్రి కేతన కమ్మనాటిని బరిపాలించిన త్రిభువన మల్లదేవచోడునకు మంత్రిగ నుండె నని తెలియుచున్నది. మంత్రి భాస్కరుని పుత్త్రులైన కేతన మల్లన మంత్రులు కమ్మనాటి చోడులకొల్వులోఁ బ్రఖ్యాతులై యుండిరి. మంత్రిభాస్కరుని మూఁడవకుమారుఁ డైన సిద్ధన తిక్కరాజున కాప్తమంత్రిగను సేనాపతిగ నుండెను. భాస్కరుని నాలుగవ కుమారుఁడు

  1. See Nellore Inscriptions published by Messers Butterworth and Venugopal chetti.