6
తిక్కన సోమయాజి
పఁబడిన కొమ్మనామాత్యుని సామాన్యకరణముగా వాకొనుట మిక్కిలి శోచనీయము. మఱియును కేతనమహాకవి కొమ్మనామాత్యుని శౌచమున గంగాత్మజన్ముఁ డనియును, శౌర్యమున గాండీవధన్వుఁ డనియును, సూర్యవంశక భూపాల సుచిరరాజ్యవనవసంతుఁ డనియును వర్ణించి యుండుటగూడ నతఁడు దండనాయకుఁడుగ నుండె నని ధ్వనింపఁ జేసి తిక్కన సోమయాజి వర్ణనమును బలపఱచు చున్నదిగాని సామాన్య కరణముగా నుండె నని సూచింపు చుండలేదు. కొమ్మనా మాత్యుఁడు పృథ్వీశ్వర మహారాజుకాలములో గుంటూరున దండనాయకుఁడుగా నుండి యామహారాజు పండ్రెండవ శతాబ్ద్యంతమున విక్రమసింహపు రాథీశ్వరుఁ డైనమనుమసిద్ధిరాజు కుమారుఁడైనతిక్కరాజుతో యుద్ధము చేసి వానిచేఁ జంపఁబడి నందునఁ దరువాత దాను సూర్యవంశ్యు లైన తెలుఁగు చోడరాజుల కొల్వులోఁబ్రవేశించి ప్రఖ్యాతుఁడై యుండును. అట్లు గానియెడల కేతనకవి కొమ్మనామాత్యుని 'సూర్యవంశక భూపాలసుచిర రాజ్యవనవసంతుఁ' డని యూరక వర్ణింపఁడు. అతని మూడవఁ యన్న యగు సిద్ధనామాత్యుఁడు తిక్కరాజునకు మంత్రియు సేనాపతియు నై యుండుటచేత కొమ్మనామాత్యుఁడు గాని వాని మరణానంతరము కుమారుఁడు తిక్కనగాని గుంటూరు మండలమును విడిచి నెల్లూరునకుఁ బోయి యుందురు. కొమ్మనామాత్యుని మూఁడవయన్న యగుసిద్ధనామాత్యుఁడు తిక్క