5
16. రాజ్యూంగ తంత్రము.
మొదటి భాగము.
గ్రంథకర్త. వల్లూరి- సూర్యనారాయణరావుపంతులుగారు, బి.ఎ., బి.ఎల్.,
రాజకీయ స్వాతంత్ర్యములను నిబంధనానుకూల రాజకీయాందోళనమువలన సంపాదించుకొనఁగలుగుట ప్రపంచధర్మము. అట్టిహక్కులు మనహిందూదేశమునకును రావలసియున్నవి. ప్రజలందఱునట్టి యాందోళనము చేయుటకుముందు ప్రపంచమునందలి యన్నిదేశముల రాజ్యాంగ తంత్రములను గ్రహింపవలసియున్నది. ఇట్టి లోపమును ఆంధ్రలోకమునకు తీర్చు కొఱకీ గ్రంథమును గ్రంథకర్త రచియించెను. శైలిబహుసులభము. వెల చందాదారులకు రు. 1-0-0. ఇతరులకు రు. 1-8-0.
17. కమలకుమారి.
గ్రంథకర్త:- బాలకవి సారనంది వెంకటరమణమూర్తి.
శ్రీ శివాజీచక్రవర్తి శిహ్వగడమనుకోట పట్టుకొనిన కధ నవలగా వ్రాయబడినది. చందాదారులకు రూ. 0-10-0. ఇతరులకు వెల రూ. 1-0-0
18. రాజ్యాంగ తంత్రము.
రెండవ భాగము.
గ్రంధకర్త :-మ-రా-రా. వల్లూరి సూర్యనారాయణరావు పంతులు గారు, బి.ఏ. బి. ఎల్ . ఎల్. టి.
గ్రంధకర్తగారు దీనిమొదటి భాగమునందు ఆంగ్లేయ రాజ్యాంగతంత్రములును ఆమెరికాసంయుక్త రాష్ట్రము నతివిపులముగ వివరించి ఈభాగమునందు తక్కిన అన్నిదేశముల రాజ్యతంత్రములను అతి సులభశైలిని వివరించియున్నారు, శైలిబహుసులభము. వెల చందాదారులకు 0-8-0 ఇతరులకు 0-12-0.
19. ప్లేటోగారి రాజనీతి శాస్త్రము.
గ్రంథకర్త:- మల్లాది వెంకటరత్నంగారు, బి.ఎ., ఎల్, టీ.
ఏయేపద్దతులమీద స్వరాజ్యమును, ఏర్పరచవలెనో తెలుపు గ్రంథము. కాలమునకు తగిన గ్రంథము.
వెల చందాదారులకు రు 0-10-0 ఇతరులకు 0-14.0