4
సారిచదివి పారవేయక ప్రతిదినము పఠింపవలసిన గ్రంథరాజము. వెల చందాదారులకు 0.18-0, ఇతరులకు రు. 1.4-0.
13. ప్రభావతి (నవల.)
గ్రంథకర్త:- గాదె- శ్రీజగన్నాధస్వామిగారు.
ఈకధశ్రీశివాజీ చరిత్రకాలమునాఁటిది. దీనియందు శ్రీశివాజికిని విజాపురపు సుల్తానునకు నున్న పరస్పరభేదములు తరునాత సవరణ, చక్కగ తెలుపబడినవి. శ్రీ శివాజీ మహారాజుయొక్క అద్వితీయ దేశాభిమానము చక్కగ వర్ణింపబడినది. రామదాసస్వామియొక్క నీతిబోధలను చదువ తగియున్నవి. ఆయా సందర్భములకు తగిన వర్షనలనుకలిగియున్నది. శైలి సులభము వెల, చందాదార్లకు రు 0-12-0, ఇతరులకు 1-4-0.
14. పశుశాస్త్రము.
గ్రంథకర్త :- టేకుమళ్ల - రాజగోపాలరావుగారు, బి. "ఏ.,
కృష్ణాజిల్లా వ్యవసాయసంఘ గౌరవ కార్యదర్శిగారగు గోపిశెట్టి- నారాయణస్వామి, బి. ఏ., గారి యుపోద్ఘాతముతో
ఈగ్రంధమునందు మనదేశమందలి పశువులు, ఇతర దేశమునందలి పశువులు, పశువుల యాహారములు, ఏయే పదార్థములు పాడి పశువులకు పెట్టిన సాలు బాగుగా నిచ్చునో వాని వివరములు, పశురోగములకు తగు వైద్యములు ఈ మొదలుగాగలయంశముల నన్ని(టినిబహుసులభ శైలిని వ్రాసియున్నారు. పశువులుగల ప్రతివారును చదివి తీరవలసిన గ్రంథము , చందాదారులకు రు 0.6-0. ఇతరులకు కు, 0-10-0.
15. చీనాదేశ చరితము.
గ్రంథకర్త - బేతపూడి లక్ష్మీకాంతరావుగారు,
ప్రపంచమునందలి అన్ని దేశముల చరిత్రములును చదవవలసిన యావశ్యకతయట్లుండగా ఎన్నో విధముల మనదేశముయొక్క పోలికగల చరిత్రమును చదివితీర వలపినదే, వెల చందాదారులకు రు. 0-13-0, లు. ఇతరులకు, 1-4-0.