Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రభాషాభివర్ధనీ సంఘము, లిమిటెడ్.,

(ప్రారంభము 1907).

యీ సంఘమువారు ఆంధ్రభాషాభివృద్దికిని తన్మూలమున దేశాభివృద్దికిని ఆంధ్రుల అభివృద్దికిని ఆవశ్యమైన గ్రంథములను అనగా దేశదేశముల చరిత్రములు, శాస్త్రగ్రంథములు, మహనీయుల జీవితచరిత్రములు ఇతరభాషలలోని గొప్ప గ్రంథముల భాషాంతరీకరణములు, మొదలగు గ్రంథములను తెలుగు భాషలో ప్రకటింప నిశ్చయించుకొని, ఇప్పటివరకు ఈదిగువ గ్రంథములను ప్రకటించిరి. సంఘమువారివలన ప్రకటింపబడు గ్రంథముల నీక్రింది నియమములకులోబడి కొనవచ్చును.

చందాదారులగుటకు నియమములు

(1) చందాదార్లు ప్రవేశరుసుము నాల్గణాల నీయవలెను.

(2) చందాదార్లకు సంఘప్రకటనలనన్నిటిని పోస్టేజీగాక నూరు పేజీలకు నాల్గణాలచొప్పున నీయబడును. ఒక్కొక పుస్తుకము తయారు కాగానే వి. పి. గా పంపబడును.

(3) చందాదార్లగువారు సంఘమువారివలనఇక మీదట ప్రకటింప బడబోవు గ్రంథముల నన్నిటిని కొనవలెను. ఇదివరకు ప్రకటింపబడిన గ్రంథములలో వారిష్టమువచ్చిన వానిని కొనవచ్చును.

(4) ఒక్కొక చందాదారు చందాదార్ల వెలలకు ఒక్కొక గ్రంధమునకు ఫైనపొందజాలరు.

(5) ఆయాగ్రంథమునకు తగినట్టుగను, అవసరమైనట్టుగను చిత్రపటములు చేర్చబడును. పుస్తకముల నందముగ నుండునటుల జేయవలసిన ప్రయత్నములు చేయబడును.

వల్లూరి - సూర్యనారాయణరావు, బి.ఎ., బి.ఎల్ ., ఎల్.టి., శెక్రటరి.

ఉత్తరములు వ్రాయవలసిన విలాసము:-

శారదా పబ్లిషింగు కంపెనీ,

185; మౌంటురోడ్డు, మద్రాసు.