Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవ యధ్యాయము

119


వ్యర్థపదము లంతగా నుండవు, పదములకూర్పు మాత్రమె గాక యర్థసందర్భమును మిక్కిలి పొందికగా నుండును. ఏవిషయము చెప్పినను యుక్తియుక్తముగాను ప్రౌఢముగాను నుండును. ఎక్కడ నేవిశేషణము లుంచి యేరీతి నేపదములు ప్రయోగించి రసము పుట్టింపవలయునో యీకవికిఁ దెలిసి నట్లు మఱియొకరికిఁ దెలియదు. ఈతనికవిత్వము లోకోక్తులతోఁ గూడి జాతీయముగా నుండును. ఈయన పదలాలిత్యమును, యుక్తిబాహుళ్యమును, అర్థగౌరవముసు, రచనాచమత్కృతియు, శయ్యావిశేషమును, సందర్భశుద్ధియు, కల్పనాకౌశలమును, అన్యులకు రావు."

శ్రీమదాంధ్రమహాభారతమునకుఁ బీఠిక వ్రాసిన కీర్తిశేషులైన శతఘంటము వేంకటరంగశాస్త్రిగా రీకవికవిత్వమహిమను గూర్చి యిట్లు వ్రాసి యున్నారు.

"విషయమునం జూచినను నిమ్మహాకవికి సమానుఁడని చెప్పఁ దగినకవియొక్కడు నిప్పటికి వినంబడఁడు. ఇఁక నధికుఁడు లేఁడని చెప్ప నేల? ఈమహాకవికవనముంగూర్చియెంత సెప్పినం జెప్పవలసియే యుండును గాని యొకప్పటికైనం దనివి దీఱఁ జెప్పి నట్లుండదు ......ఈమహాకవి గ్రంథముం జూచి నేర్చుకొనవలసిన విషయములు నెన్నియేనిఁ గలవు. ఆంధ్రభాషాకవిత్వ మర్మ మీతనికిఁ దెలిసినట్టులు మఱియే యాంధ్రకవికి నిప్పటికిని దెలియదనియు, నిరాక్షేపముగాఁ జెప్పవచ్చును.”

ఇట్టిమహత్కార్యమును నెఱవేర్చుటచే నాధునికవిద్వాంసులే గాదు గొనియాడినది. తిక్కనసోమయాజి యనంతరకాల