Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

తిక్కన సోమయాజి


     శరణముగ నాశ్రయింపుము సకలదురిత
     ములకుఁ దొలగింతు నిన్నుఁ బ్రమోమంద."

అనుపద్యమున దేనిఁగించి

"శ్లో. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థోధనుర్ధరః
     తత్ర శ్రీర్విజయో భూతిర్థ్రునా నీతిర్మతిర్భ్రతు||

అనుభగవద్గీత్యాంతశ్లోకమును .

"తే. అధిపయో గేశ్వరేశ్వరుం డైనకృష్ణుఁ
    డను థనుర్ధరవర్యుఁ డర్జునుఁడు నెచట
    నిలిచి రచ్చట విజయంబు నీతి సిరియు
    భూత నిత్యంబు లగు విది నాతలంపు."

అనుపద్యమున నాంధ్రీకరించెను.

తిక్కనకృతమైన మహాభారతకావ్యభాగ మాంధ్రభాషలో నద్వితీయ మైనదిగా నున్నది. ఇది ప్రపంచములోని యుత్తమోత్తమకావ్యములలో నొక్కటియనుటకు సంశయములేదు. ఇతని కవిత్వమహిమాదులను గూర్చి పూర్వకవుల యొక్కయు పండితులయొక్కయు నభిప్రాయములను దెలుపుటకంటె నేను జెప్పఁదగిన దింతకంటె నేమియునులేదు. ఆంధ్రకవులచరిత్రమునందు రావుబహదరు వీరేశలింగముపంతులుగా రిటులు వ్రాసి యున్నారు.

'కాని తిక్కనసోమయాజిశైలితో సమానముగా వ్రాయుటమాత్ర మెవ్వరికిని సాధ్యముగాదు. తెలుఁగుభాషయం దేన్నోగ్రంథములున్నను తిక్కసోమయాజికవిత్వముతో సమానముగాఁ గాని దానిని మించునట్లుగాఁ గాని కవిత్వము చెప్పఁ గలిగినవారు నేటివఱ కొక్కరును గనఁబడలేదు. తిక్కనకవిత్వము ద్రాక్షాపాకమై, మిక్కిలి రసవంతముగా నుండును. ఈతని కవిత్వమునఁ బాదపూరణమునకై తెచ్చిపెట్టుకొనెడు