పుట:Tikkana-Somayaji.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవ యధ్యాయము

113


ఇఁక నిర్వచనోత్తరరామాయణములోని పద్యములను గొన్నిటిని మార్చియు, మార్పకయు భారతమునఁ బ్రయోగించినవానిలో నొకటిరెండు దృష్టాంతములను జూపి విరమించు చున్నాను.

"చ. గుణమున లస్తకంబునను గోటియుగంబునఁ గేలఁ దారఁ భీ
     షణముగ నుప్పతిల్లి రభసంబున రేఁగినమాడ్కిఁ దీవ్రమా
     ర్గణనికరంబు లొక్కట నరాతిబలంబులఁ గప్ప శార్‌జ్ఞ ని
     క్వణనము గోదసీకుహరకర్పరముం బగిలింప నుగ్రతన్."

ఈపద్యమును నిర్వచనోత్తరరామాయణములో మూడ వయాశ్వాసమున మొదట వ్రాసియున్నాఁడు. దీనినే విరాటపర్వములో నైదవయాశ్వాసమునఁ గొంచెము మార్పుచేసి యీక్రిందిరీతిగాఁ బ్రయోగించి యున్నాడు.

"చ. గుణమున లస్తకంబునను గోటియుగంబునఁ గేలఁ జాల భీ
     షణముగ నుప్పతిల్లి రభసంబున రేఁగినమాడ్కిఁ దీవ్రమా
     ర్గణనికరంబు లొక్కట నరాతిబలంబులఁ గప్పగాండిర
     క్వణనము రోదసీకుహరకర్పరముం బగిలింప నుగ్రత౯."

ఇందు 'తార' యనునది 'చాల' గను 'శార్‌ఙ్గనిక్వణన' మనునది 'గాండివక్వణనము' గను మార్చఁ బడినవి.

మఱియు తిక్కన సోమయాజి,

"మ. కలఁగెం దోయధిసప్తకంబు గిరివర్గం, బెల్ల మాటా డె సం
     చలతం బొందె వసుంధరావలయ మాశాచక్ర మల్లాడెఁ గొం
     దల మండెం ద్రిదశేంద్రుపట్టణము పాతాళంబు ఘూర్ణిల్లె నా
     కుల మయ్యెం గ్రహతారకాకులము సంక్షోభించె నావేధయున్,"

అనునిర్వచనోత్తర రామాయణములో నైదవయాశ్వాసము