తొమ్మిదవ యధ్యాయము
109
ఉద్యోగపర్వములో కౌరవులకడకు శ్రీకృష్ణునిరాయబారిగాఁ బంపినపుడు పాండవు లేవురును తమతమయభిప్రాయములను వేఱువేఱ కృష్ణునితోఁ జెప్పునప్పుడు భీముఁడు దన మాటగాఁ జెప్పినట్లుండు,
"తే. అన్నదమ్ములమై యుండి యకట మనకు
నొరులు దలయెత్తి చూడ నొండొరులతోడఁ
బెనఁగ నేటికి నీ నేల పెద్దవారి
బుద్ధి విని పంచి కుడుచుట పోల దొక్కొ?"
అనుపద్యమునే స్త్రీపర్వములో గాంధారికిఁ గోపశాంతి కలిగించుటకై వినయముతో భీముఁడు ప్రయత్నించి నపుడును జెప్పియున్నాడు.
విరాటపర్వములో ప్రథమాశ్వాసమున విరాటరాజు తనకూఁతు రగునుత్తరను నాట్యశిక్షకై బృహన్నల కప్పగించుటకై రప్పించునప్పు డామెను వర్ణించిన,
"సీ. అల్లదనంబున ననువు మైకొనఁ జూచు
నడపుకాంతికి వింతతొడవు గాఁగ
వెడనెడ నూఁగారి వింతయై యేర్పడ
దారనివళులలో నారు నిగుడి
నిట్టలు ద్రోఁచుచు నెలవుల కలమేర
లెల్లను జిగియెక్కి యేర్పడంగఁ
దెలుపును గప్పును వెలయంగ మెఱుఁగెక్కు .
తారకంబులఁ గల్కితనము దొడరఁ