Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవ యధ్యాయము

107


వింపఁబడి 'శ్రీమహాభారతము నాంద్రీకరించిన యీమహాకవికీ చిఱుపద్యములోని యల్పభాగము తోఁచకపోయె ననిసాధించుట కీకథపనికిరాదు గాని తిక్కన యాశుధారగా కవిత్వము చెప్పఁగలవాఁ డనిస్థాపించుటకై యీకథ కల్పింపఁ బడె నని మాత్ర మూహింపఁ దగి యున్న దని యాంధ్రకవులచరిత్రమునం దేసమాధానము చెప్పఁబడి యుస్నది. ఈపద్యము మూలముననే గురునాథుఁ డొకఁడు జన్మ మెత్తినాఁడు. ఈ పద్యము మహాభారతమునఁ దిక్కనసోమయాజి వ్రాయ కుండె నేని కుమ్మరగురునాథుఁడు జన్మమెత్తకయే యుండును.

తిక్కనసోమయాజికిఁ గుమ్మరగురునాథుఁడు లేఖకుఁడుగా నుండె ననుట సత్వము గాదు. తిక్కన చేసినప్రతిజ్ఞ మాటయు సత్యము కాదు. తిక్కన పూర్వాపరసందర్భములను జక్కగా నాలోచించి కవిత్వము చెప్పినవాఁడుగాని పై ప్రతిజ్ఞతోఁ జెప్పినవాడు కాఁడని యీక్రిందివిషయమునుబట్టి స్పష్టపడఁగలదు.

ఒకసారి చెప్పినవిషయమును మరలఁ జెప్పవలసినచ్చినప్పుడును, పూర్వోక్తార్థమున కనువాదముఁ జేయవలసినప్పుడును తిక్కనసోమయాజి తొలుతఁ జెప్పినగద్యపద్యములనే మరలఁ జెప్పుచు వచ్చెను. మఱియు నొకప్రకరణమునఁ జేసిన వర్ణనము మఱియొక ప్రకరణమునఁ జేయవలసివచ్చినప్పుడు ప్రకరణానురూపముగఁ గొంచెము మార్పుచేసి మున్పటిగద్య