Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

తిక్కన సోమయాజి


ఈభారతమును రచించునపుడు తిక్కనసోమయాజి తడవుకొనకుండ గవిత్వముఁ జెప్పెద ననియు, తానొక్కసారి చెప్పినదానిని మరలఁ జెప్ప ననియు, చెప్పినదానిని మరల మార్చుకొన ననియు, ప్రతిజ్ఞ చేసి నట్లును, చెప్పినమాటను మరుల నడుగక గురునాథుఁడు వ్రాయుచుండగా శల్యపర్వములో ప్రథమాశ్వాసము కడపట సహదేవుఁడు శకునిని చంపినతరువాత దుర్యోధనుఁడు తొలఁగిపోయె నని ధృతరాష్ట్రునితో సంజయుఁడు చెప్పుభాగమున,

"క. పలపలనిమూకలోఁ గా
    ల్నిలువక గుఱ్ఱంబు డిగ్గి నీకొడుకు గదా
    కలితభుజుఁడగుచు నొక్కఁడుఁ
    దొలఁగి చనియె-

అన్నంతవఱకుఁ బద్యమును జెప్పి తరువాత నేమియుఁ దోఁచక తిక్కన "యేమిచెప్పుదున్గురు నాధా" యని కుమ్మరగురునాథు నడిగి నట్లును, అతఁ డదితన్నడిగినప్రశ్నగా భావింపక పద్యముతోఁ జేర్చి "తొలఁగి చనియె నేమిచెప్పుదు న్గురునాథా" యని వ్రాసినట్లును, అప్పుడు తిక్కనసోమయాజి తనప్రతిజ్ఞకు భంగమువచ్చె ననిచింతించుచుండఁగా "నేమిచెప్పుదు న్గురునాథా" కవిలేఖకునిగూర్చి యుద్దేశించినది 'కురునాథా' యని ధృతరాష్ట్రున కన్వయించి యాప్రశ్నయే పద్యపూరణమున కనుకూలించె నని గురునాథుఁ డాతని నూరార్చి నట్లును ఒక పిచ్చకథ కలదని యాంధ్రకవులచరిత్రమునందు గ్రంథస్థముగా