తొమ్మిదవ యధ్యాయము
105
"గీ. కథ జగత్ప్రసిద్ది గావునఁ బూర్వప
ర్వార్థయుక్తిఁ జేయు నట్టియెడల
యత్న మించు కంతయైనను వలవదు
వలసినట్లు చెప్ప వచ్చి యుండు.”
అని చెప్పి సోమయాజి గ్రంథము ప్రారంభము చేసెను.
అనఁగా భారతకథ జగత్ప్రసిద్ధమైనది; కావునఁ బూర్వ పర్వార్థములను సందర్భింపఁ జేయునప్పుడు యత్న మేమాత్ర మక్కరయుండ దనియును, ఇష్టానుసారముగ సందర్భము పొసగింపవచ్చు ననిచెప్పినపద్యమెగాని మఱియొండు గాదు. ఈ పద్యమును బురస్కరించుకొనియె కాఁబోలు సోమయాజి భారతముఁ దెనిగించుచో మాతృకయైన మూలగ్రంథమును ముట్టకయె యాశుధారగ నిరంకుశప్రజ్ఞతో జేసి యున్నాఁ డనుప్రవాద మొకటి లోకములో వ్యాపించి యున్నది. ఈ తెలుఁగుభారతము కష్టపడి సావకాశముగా నాలోచించి చక్కఁగాఁ జేయఁబడినగ్రంథమేగాని జనులనుకొనునట్లు మూలగ్రంథమును ముట్టక తెఱలోఁ గూరుచుండి నోరికివచ్చిన ట్లెల్లను చేయఁబడినది కా దనికవులచరిత్రమునం దీయఁబడిన సమాధానము సమంజసమైనదిగా నున్నది. తిక్కనసోమయాజి యీ భారతమును. జెప్పు నప్పుడు దీనిని వ్రాయుటకై నిర్ణయింబడిన వాఁడు కుమ్మరగురునాథుఁ డనిచెప్పుదురు. ఈగురునాథునకు చెప్పిన దానిని మరల నడుగక వ్రాయఁ గలశక్తియున్న దట.