తొమ్మిదవ యధ్యాయము
101
మంకితము చేయు మని యడిగి నట్లుగాఁ జెప్పినది ప్రౌఢముగా నున్నదనుటకు సంశయము లేదు. తిక్కనసోమయాజి తనకుఁ గలవైదికమార్గ నిష్ఠ మగువర్తనమును, హరిహరులయెడ భేదములేక సమభ క్తి గలిగి యుండుటయును, స్మరియించి తదుభయ సగుణమూర్త్యధి దేవతయగు హరిహరనాధునియెడఁ దనకుండు నిరంతరభక్తితోఁ గూడుకొన్న యాత్మానందానుభవమును లోకమునకుఁ దెలిపిన విధము మిక్కిలి ప్రౌఢముగా నున్నది.
భారతము పంచమవేద మని ప్రసిద్ధిఁ జెందినగ్రంథ మగుటచేతఁ దానిం దెనిగించునపుడు దనకును దనవంశమునకును గలశ్రేష్ఠత్వమును, దేవతాభక్తి మొదలగు వానిని బ్రకటింపక యున్నచోఁ దనగ్రంథము సర్వజనాదరణ పాత్రముగా దనుతలంపుతో సోమయాజి స్వకీయశిష్టత్వమును బ్రకటించుకొనె ననికవిజీవిత గ్రంథకారుఁడు సూచించెను. ఇదియే నిజమైనయెడల తిక్కన వైదికమార్గనిష్ఠమగు ప్రవర్తనము కల్ల యని తేటపడఁ గలదు. అభినవదండి దశకుమారచరిత్రమునఁ దిక్కననుగూర్చి చేసిన వర్ణనము తిక్కనసోమయాజి చెప్పుకొన్న వైదికమార్గనిష్ఠమగు వర్తనము కల్లగాక సత్యమైనదే యని వేనోళ్ళ రుజువు చేయు చున్నది. కాని యాకవిజీవితగ్రంథకారుఁడే మఱియొక చోట
"కాని స్వప్నములను నమ్మి వానిని గ్రంథస్థముఁ జేసినయాంధ్రకవులలో నీతఁడే మొదటివాఁడు. భగవదుపాసనాపరులకుఁ దన్మూలముగ నంతఃకరణపరిపాకము గలిగి యిట్టిభగవదనుగ్రహ సూచకస్వప్నంబు లగుటయు విశేషమహత్తులు లభ్యమగుటయు నైసర్గికములే యని యాస్తికుల