పుట:Tikkana-Somayaji.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

తిక్కన సోమయాజి

ఉ. కూర్చుట నూత్నరత్నమునకుం గనకంబునకుం దగు౯ జనా
    భ్యర్చిత మైనభారత మపారకృపాపరతంత్రవృత్తిమైఁ
    బేర్చినదేవదేవునకుఁ బ్రీతిగ నిచ్చుట సర్వసిద్ది నా
    నేర్చినభంగిఁ జెప్పి వరణీయుఁడ నయ్యెద భక్తకోటికి౯.

ఇది అనన్యసామాన్యం బగుపరమధర్మప్రకారంబు,

ఉ. కావున భారతామృతము గర్ణపుటంబుల నారఁ గ్రోలి యాం
    ధ్రావలి మోదముం బొరయు నట్లుగ సాత్యవతేయసంస్మృతి
    శ్రీవిభవాస్పదంబయిన చిత్తముతోడ మహాకవిత్వదీ
    క్షావిధి నొంది పద్యముల గద్యముల౯ రచియించెదం గృతుల్.”

ఈ పైయవతారికలోని స్పప్నవృత్తాంతమును మనము చక్కఁగాఁ బరిశీలించువార మగుదుమేని తిక్కనసోమయాజి స్వాభిప్రాయ ప్రకటనము నెంత ప్రౌఢముగాఁ జేసి యున్నాఁడో స్పష్టముగాక మానదు. ఈస్వప్నవృత్తాంత మీతనికిఁ బితృభక్తివిశేషముగాఁ గలదని తేఁటపఱచుచున్నది. తనపితృభక్తిని లోకమునకు వెల్లడించుకొఱకే స్వప్న వృత్తాంతమును జొప్పించినాఁడు. తిక్కనతండ్రి కొమ్మనామాత్యుఁడు తిక్కన బాల్యముననే మృతి నొందియుండును. తిక్కన యిట్టిపవిత్రమైనభక్తిని జూపుట కదియే కారణమై యుండు నని నాయభిప్రాయము. ఇందు హరిహరనాథుని స్వరూపము నెంతో చక్కఁగా వర్ణించి యున్నాడు. దేవునకును దనకును నడుమను దనతండ్రిని బ్రవేశపెట్టి వానిమూలమున దేవునిఁ బ్రత్యక్షము గావించుకొని “కృతిపతిత్వ మర్థించి వచ్చితిఁ దిక్కశర్మ” అని యతఁడే కావ్య